Chanakya Niti: వైవాహిక జీవితంలో విబేధాలు రాకూడదంటే.. భార్యాభర్తలు ఈ తప్పు చేయవద్దంటున్న చాణక్య
చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు.
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. రాజనీతి కోవిదుడు. తన తెలివితేటలతో సామాన్యుడైన చంద్రగుప్త మౌర్యడిని చక్రవర్తిగా చేశాడు. చాణక్యుడు రాజకీయాలే కాకుండా సామాజికానికి సంబంధించిన అనేక అంశాలను కూడా అనేక గ్రంథంలో ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే.. అవి నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. ఈ పండితుడు స్త్రీ, పురుషుల మధ్య సంబంధాల గురించే కాదు.. భార్య భర్తల బంధం నిలబడాలంటే దంపతులు చేయాల్సిన పనులు ఏమిటి.. చేయకూడనివి కూడా ప్రస్తావించాడు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం..
- ఎక్కువ తక్కువ అనే భావన: నేటి కాలంలో పురుషులు, మహిళలు సమానంగా పరిగణించబడుతున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది పురుషులు ఇంకా ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతోనే ఉన్నారు.. భర్తతో అదే భావంతో జీవిస్తున్నారు. అయితే మారుతున్న కాలంలో పాటు.. అటువంటి ఆలోచనలు వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. భార్యాభర్తల బంధంలో భర్త తాను ఎక్కువ అని భావిస్తూ భార్యను బానిస ఎంచితే.. ఆ ప్రభావం జీవితంపై పడుతోందని ఆచార్య చెప్పారు. అంతేకాదు.. అది భర్త మూర్ఖత్వానికి నిదర్శనం అని తెలిపారు.
- ఖర్చు జీవితాన్ని సక్రమంగా గడపాలంటే డబ్బు చాలా అవసరం. భార్యాభర్తల మధ్య డబ్బు వినియోగం గురించి సరైన సమాచారం ఉన్నప్పుడే .. వారిద్దరి మధ్య సంబంధం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి డబ్బుల విషయంలో రహస్యంగా ఉండడం ప్రారంభించే ఇద్దరి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వివాదం ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టదు.
- గౌరవం ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. ముఖ్యంగా భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ.. అభిప్రాయాలను పంచుకుంటే అది భార్యాభర్తల బంధం మరింత గట్టపడేలా చేస్తుంది. తన పరువును మరచి .. గౌరవించుకొని భర్త భర్తల బంధానికి గ్రహణం పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. చాణక్య నీతి ప్రకారం.. దంపతులు ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.
- కోపం భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని ముగింపు దశకు తీసుకెళ్లే అనుభూతి. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రతి మలుపులోనూ నిరాశను ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్య నీతి ప్రకారం, పురుషుడు లేదా స్త్రీ ఎప్పుడూ కోపంగా ఉన్నప్పటికీ, తనను తాను అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంత చిత్తంతో సమస్యకు పరిష్కారం కనుగొనాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)