Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి అలర్ట్.. ఆ సేవల్లో మార్పులు చేసిన దేవస్థానం..

పవిత్ర కార్తీక మాసంలో శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. దేవదేవుడైన నీలకంఠుడి దర్శనంతో పాటు శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారినీ దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి..

Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి అలర్ట్.. ఆ సేవల్లో మార్పులు చేసిన దేవస్థానం..
Srisailam Temple
Follow us

|

Updated on: Nov 17, 2022 | 7:40 AM

పవిత్ర కార్తీక మాసంలో శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. దేవదేవుడైన నీలకంఠుడి దర్శనంతో పాటు శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారినీ దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీగిరులు భక్తులతో కిక్కిరిశాయి. ఈ పరిస్థితుల నడుమ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆలయ ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేశారు. రేపటి నుంచి ఈనెల 23 వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేశారు. శుక్రవారం నుంచి రాత్రి 9 గంటలకు భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు. స్వామి, అమ్మ వార్లకు కల్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్ర హోమం, చండీ హోమం యధావిధిగా కొనసాగిస్తారు. శని, ఆది, సోమవారాల్లో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఆలయ అధికారులు కల్పించనున్నారు.

మరోవైపు.. కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన లక్ష దీపోత్సవం ఆధ్యాత్మిక శోభను నింపింది. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసిన అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతా మూర్తులకు పుష్కరిణికి శాస్త్రోక్తంగా హరతులిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి