Breaking: కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

Covid Vaccine: కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో శుభవార్త. ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. జనవరి 13వ తేదీ నుంచి దేశమంతటా..

Breaking: కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!
Follow us

|

Updated on: Jan 05, 2021 | 6:04 PM

Covid Vaccine: కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.! జనవరి 13వ తేదీ నుంచి దేశమంతటా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అత్యవసర వినియోగ అనుమతి వచ్చిన 10 రోజుల్లోగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే దేశంలో కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రం పూర్తి చేసింది.

కాగా, తొలిదశలో మూడు కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్‌ కోసం కరోనా వారియర్స్ ‘కోవిన్’ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులూ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తామని కేంద్రం తెలిపింది. కాగా, జనవరి 3వ తేదీన ఆక్స్‌‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్‌ టీకాలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్

కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ ట్వీట్…