Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Shaurya: నాగశౌర్య ‘న్యూఇయర్’ లుక్ అదుర్స్.. క్యూట్ బాయ్‏గా కనిపిస్తోన్న యంగ్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‏గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఆ తర్వాత చిన్న సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాగశౌర్య.

Naga Shaurya: నాగశౌర్య 'న్యూఇయర్' లుక్ అదుర్స్.. క్యూట్ బాయ్‏గా కనిపిస్తోన్న యంగ్ హీరో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2021 | 4:46 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్‏గ్రౌండ్ లేకుండా వచ్చినా  మొదట  చిన్న సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నాగశౌర్య. ఛలో, ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల హీరోయిన్ అక్కినేని సమంత నటించిన ఓ బేబి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో. తాజాగా నాగశౌర్య తన న్యూఇయర్ లుక్ అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఓ ఫోటో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఎప్పుడు సినిమా షూటింగ్‏లలో బిజీగా ఉండే హీరోహీరోయిన్లు.. కాస్త ఖాళీ సమయం దొరికితే సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటారు. తమ అభిమానులతో ముచ్చటించడం లేదా తమకు నచ్చిన ఫోటోలను షేర్ చేయడం వంటివి చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా హీరో నాగశౌర్య కూడా తన న్యూఇయర్ లుక్ అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో.. “నా గడ్డానికి కూడా ఇది కొత్త సంవత్సరం” అనే క్యాప్షన్‏ను జతచేశాడు. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు నువ్వేనా.. ఇంత మారిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నాగశౌర్య.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న వరుడు కావలెను సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో పెళ్ళి చూపులు ఫేం రీతు వర్మ హీరోయిన్‏గా నటిస్తుండగా.. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకులిగా పరిచయమవుతున్నారు.

Also Read:

New Year 2021: న్యూఇయర్ గిఫ్ట్‏గా ‘వరుడు కావలెను’ పోస్టర్ రివీల్.. రీతువర్మ, నాగశౌర్య లుక్ అదుర్స్..