కోలీవుడ్ బాటలో టాలీవుడ్.. థియేటర్లలో ఫుల్ సీటింగ్ ఇవ్వండి.. ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అభ్యర్ధన.!

Film Producers Council: తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్..

కోలీవుడ్ బాటలో టాలీవుడ్.. థియేటర్లలో ఫుల్ సీటింగ్ ఇవ్వండి.. ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అభ్యర్ధన.!
theatres
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 05, 2021 | 3:46 PM

Film Producers Council: తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్లలో వంద శాతం సీటింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. తమిళనాడులో వంద శాతం సీటింగ్‌కు ఓకే చెబుతూ అక్కడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని అందులో పేర్కొంది.

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలలో అమలవుతున్న 50 శాతం సీటింగ్‌తో థియేటర్ల యాజమాన్యాలకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని.. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 100 శాతం సీటింగ్‌కు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరుతోంది. కాగా, ఈ సంక్రాంతికి తెలుగులో వరుసపెట్టి బడా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అభ్యర్ధనకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది వేచి చూడాలి.

Also Read:

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్