కరోనా వైరస్ వ్యాక్సిన్ పై మాలో విభేదాల్లేవు, కలిసి కట్టుగా ప్రాజెక్టుపై కృషి, సీరం, భారత్ బయోటెక్.
కరోనా వైరస్ వ్యాక్సిన్ పై తమలో విభేదాల్లేవని,కలిసి కట్టుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేయాలన్న అవగాహనకు వచ్చామని సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి..

Covid Vaccine:కరోనా వైరస్ వ్యాక్సిన్ పై తమలో విభేదాల్లేవని,కలిసి కట్టుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేయాలన్న అవగాహనకు వచ్చామని సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి.ఈ మేరకు సీరం సీఈఓ ఆదార్ పూనావాలా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దేశంలో సజావుగా ఈ బృహత్తరప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, జీవితాలను పరిరక్షించడమే ముఖ్యమని వారు స్పష్టం చేశారు. ఇలా అని ప్రమాణం చేస్తున్నామన్నారు. ఈ దేశానికి, ప్రపంచానికి కూడా మా వ్యాక్సిన్లను అందజేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం, ఈ టీకామందుల ఉత్పత్తి, సప్లయ్ విషయంలో వేర్వేరుగా కాకుండా కలిసి సహకరించుకుంటాం అని ఆదార్ పూనావాలా, కృష్ణ ఎల్లా తెలిపారు.
ఈ యాక్టివిటీలో తమ రెండు కంపెనీలు పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని, అనుకున్న ప్రకారం కార్యాచరణను అమలు చేస్తామని వీరు ప్రకటించారు. ప్రజలకు, దేశాలకు వ్యాక్సిన్ల ఆవశ్యకత గురించి తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. కాగా- తమ రెండు సంస్థల మధ్య వ్యాక్సిన్ల విషయంలో మిస్ కమ్యూనికేషన్ ఉందని, దీన్ని క్లియర్ చేస్తామని అంతకుముందు ఆదార్ పూనావాలా ట్వీట్ చేశారు.
Joint statement just out from Serum Institute of India & Bharat Biotech: pic.twitter.com/weLIDSDVWN
— Shiv Aroor (@ShivAroor) January 5, 2021
Also Read:
Business News: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేయండి..
రిలయన్స్ పిటిషన్ పై పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు, నోటీస్ ఆఫ్ మోషన్ జారీ



