Business News: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేయండి..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దాదాపు 8.5 శాతం వడ్డీ డబ్బులను ఖాతాదారుల అకౌంట్లలో వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వడ్డీ రేటు 15 బేసిక్ పాయింట్లు తక్కువ అని చెప్పవచ్చు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి కూడా 8.5 వడ్డీ చెల్లిస్తామని గతంలో చెప్పారు. తాజాగా ఈ వడ్డీ రేటు డబ్బులను ఇప్పుడు అకౌంట్లలో వేయనున్నట్లుగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు.
పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి తమ ఖాతాలో ఎంత వరకు నగదు జమ అయింది అనే విషయం తెలియదు. చాలా వరకు పీఎఫ్ ఖాతాల్లో ఉన్న డబ్బు వివరాలను ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. ఇక ప్రముఖ ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేరుగా ఈపీఎఫ్‌వో వెబ్సైట్లోకి వెళ్ళి మీ అకౌంట్లలో డబ్బు ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు పీఎఫ్ అకౌంట్‌కు లాగిన్ అయ్యి .. ఆ తర్వాత యూఏఎన్ నెంబర్, పాస్ వర్ట్ ఎంటర్ చేయాలి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నంబరుకు మేసేజ్ చేయాలి. మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ అకౌంట్లోని బ్యాలెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇవన్ని కాకుండా సులభంగా 011-22901406 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ అకౌంట్ నగదు వివరాలు తెలుస్తాయి.
Also Read:
PF ఖాతాదారులకు శుభవార్త.. ఒకేసారి అకౌంట్లోకి డబ్బులు.. స్టాక్ మార్కెట్లే కారణామా?..
మీరు ఉద్యోగస్తులా.. మీకు పీఎఫ్ కట్ అవుతోందా.. ఈపీఎఫ్ మీ కోసం ఈ సర్వీసును తీసుకొచ్చింది..