AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird Flu Virus News: ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు బర్ద్ ఫ్లూ భయం.. దేశవిదేశాల్లో కలవరం.. మానవాళికి సవాల్

ఓ వైఫు కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా మన దేశం కోలుకోక ముందే మళ్ళీ దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టిస్తుంది...

Bird Flu Virus News: ఓ వైపు కరోనా కల్లోలం, మరోవైపు బర్ద్ ఫ్లూ భయం.. దేశవిదేశాల్లో కలవరం.. మానవాళికి సవాల్
Surya Kala
|

Updated on: Jan 05, 2021 | 3:46 PM

Share

ఓ వైఫు కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా మన దేశం కోలుకోక ముందే మళ్ళీ దేశంలో బర్ద్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర కలకలం సృష్టిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో వెలుగు చూసిన ఈ వైరస్ క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్, కేరళలో బర్ద్ ఫ్లూ ల్లోనూ గుర్తించారు. దీంతో బర్ద్ ఫ్లూ సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాల సంఖ్య నాలుగుకి చేరుకుంది. ఇప్పటికే రాజస్తాన్ ప్రభుత్వం హై ఎలర్ట్ ప్రకటించగా… తాజాగా కేరళ సర్కార్ కూడా హై ఎలర్ట్ ను ప్రకటించింది. అసలు బర్ద్ ఫ్లూ అంటే ఏమిటి… ఎలా సోకుతుంది.. తెలుసుకుందాం..

ఏవియన్‌ ఇన్‌ ఫ్యూయంజా ను బర్డ్ ప్లూ అని పిలుస్తారు. ఈ వైరస్ ఎక్కువగా పక్షిజాతులకు సోకుంటుంది. ముఖ్యంగా ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. ‘హెచ్5ఎన్1’ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి కోళ్లకు సోకినప్పుడు రెండు రకాల లక్షణాలు కన్పిస్తాయి. ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉంటె.. కోళ్ల ఈకలు రాలిపోవడంతో పాటు , గుడ్డ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అదే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. కోడి శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతిని 48 గంటలోపు మరణిస్తుంది. కోడి రెట్ట ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుంచి మరొక కోడికి త్వరగా వ్యాప్తిచెందుతుంది. అంతేకాదు.. ఈ వైరస్‌ వ్యాప్తికి వివిధ పక్షులు వాహకాలుగా పనిచేస్తాయి.. పక్షుల నుంచి ‘బ‌ర్డ్ ఫ్లూ’ వైరస్ మ‌నుషుల‌కు కూడా సోకే ప్రమాదం ఉంది. కోళ్ల ద్వారా ఇది మరింత ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు ‘హెచ్1ఎన్1’, ‘హెచ్1ఎన్2’, ‘హెచ్3ఎన్2’ వైరస్ లు సోకుతాయి. కోళ్లకు ‘హెచ్5ఎన్1′ వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈ వైరస్ ప్రాణాంతకమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకి 1918 లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ ని గుర్తు చేస్తున్నారు. ఈ వైరస్ 1918 లో అమెరికా లోని ఓ సైనిక శిబిరంలో పుట్టి ప్రపంచాన్ని వణికించింది. ఈ వైరస్ కేవలం 6 నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టిముట్టేసింది. 4 కోట్లమందికి పైగా ఈ వ్యాధిబారిన పడి మృతి చెందారని సుమారు అప్పటి ప్రపంచ జనాభాలో 3 నుంచి 6 శాతం వరకూ జనాభా మరణించారని అంచనా. అయితే ఈ వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందిందో.. అంతే వేగంగా అంటే దాదాపు 18 నెలల్లోనే అదృశ్యమైంది.

అయితే ప్రస్తుతం బర్ద్ ఫ్లూ కూడా అదేవిధంగా రూపాంతరంము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 – 30 శాతము ప్రజలపై ఈ వైరస్ ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి భారత్ లో హెచ్5ఎన్1’ వైరస్ మొదటి సరిగా 1997 లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వ్యాధి వ్యాపించకుండా 2008 లో పశ్చిమ బెంగాల్లో సుమారు 20లక్షల కోళ్లను వధించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 353 మందికి ఈ వ్యాధి సోకగా.. వారిలో 221 మంది చనిపోయారు. మరణించిన వారిలో 60శాతం ఇండోనేషియా, వియత్నాంలకు చెందినవారున్నారు. ఇప్పటికే మానవాళిని కోవిడ్ 19 భయపెడుతున్న నేపథ్యంలో హెచ్5ఎన్1 వైరస్ వ్యాపించకుండా కోళ్ల పరిశ్రమలో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: Bird Flu In Kerala: కేరళలో విజృంభిస్తోన్న బర్డ్‌ ఫ్లూ… రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం..

Also Read: Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.