Catherine Tresa: కళ్యాణ్ రామ్‌తో జతకట్టనున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బ్యూటీ.. పొలిటికల్ కథాంశంతో కొత్తగా..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తగా వ్వవహరిస్తున్నాడు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. దీంతో తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తగా వ్వవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్, వేణు మల్లిడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాకు ‘తుగ్లక్’ అని టైటిల్ కూడా ఖరారు చేశారట.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటించేందుకు కేథరిన్‌ను ఎంపికచేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేథరిన్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. 2013లో ఛమ్మక్ ఛల్లో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ అప్పటి నుంచి సరైన హిట్ అందుకోలేదు. చాలా సినిమాల్లో కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో స్మితా మేడంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కేథరిన్.
Also Read:
ఆ సక్సెస్ఫుల్ ప్రొడ్యుసర్‌తో నందమూరి యంగ్ హీరో కొత్త సినిమా.. ఇంతకీ టైటిల్ అదేనా ?..