YSRCP: వైసీపీ సంచలన నిర్ణయం.. రేపు, ఎల్లుండి జనాహ్రగ దీక్షలు..

YSRCP: ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

YSRCP: వైసీపీ సంచలన నిర్ణయం.. రేపు, ఎల్లుండి జనాహ్రగ దీక్షలు..
Ysrcp
Follow us
uppula Raju

|

Updated on: Oct 20, 2021 | 8:52 PM

YSRCP: ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వగా వైసీపీ నిరసనలతో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీడీపీ బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 36 గంటల దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

ఇదిలా ఉంటే పోటాపోటీ ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. అటు నేతల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరి హైవొల్టేజ్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. కాగా ఇటు ప్రతిపక్షాలు సీపీఐ, జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందడానికే టీడీపీకి మద్దతిస్తున్నాయని మరోవైపు వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తానికి పట్టాబి వ్యాఖ్యల నుంచి మొదలైన దుమారం కంటిన్యూ అవుతోంది. పరస్పర కేసులతో ప్రస్తుతానికి ఈ సమస్య పోలీసులకు వద్దకు చేరింది.

Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్..! వచ్చే ఏడాది జీతాలలో పెరుగుదల..?

Aadhar: మీ ఆధార్ కార్డును ఎవరైనా ఉపయోగిస్తున్నారా? అది చాలా ప్రమాదం.. అటువంటి అనుమానం ఉంటె ఇలా చెక్ చేసుకోండి!

UPSC: విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ని ప్రారంభించిన UPSC.. ఈ సేవలు అందుబాటులోకి..