AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్..! వచ్చే ఏడాది జీతాలలో పెరుగుదల..?

Employees: భారతదేశంలో వచ్చే ఏడాది నుంచి వేతనాలు పెరుగుతాయని అందరు భావిస్తున్నారు. 2022లో ఉద్యోగుల

Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్..! వచ్చే ఏడాది జీతాలలో పెరుగుదల..?
Rupee
uppula Raju
|

Updated on: Oct 20, 2021 | 8:12 PM

Share

Employees: భారతదేశంలో వచ్చే ఏడాది నుంచి వేతనాలు పెరుగుతాయని అందరు భావిస్తున్నారు. 2022లో ఉద్యోగుల జీతం సగటున 9.3 శాతం పెరుగుతుందని ఒక నివేదికలో వెల్లడైంది. 2021లో ఇది 8 శాతంగా ఉందని ఒక అంచనా. 2022లో పలు కంపెనీల ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఉద్యోగులను ఆకర్షించడం, నిలుపుకోవడమే అని తేలింది. ఈ పరిస్థితిలో కంపెనీలు ఉద్యోగులకు మరింత ఇంక్రిమెంట్ ఇస్తాయని పలువురు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.

వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్‌లో అత్యధిక జీతాల పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది. వచ్చే 12 నెలల్లో వ్యాపార దృక్పథం మెరుగుపడుతుందని అందరు భావిస్తున్నారు. 2021 మే, జూన్‌లో ఆసియా-పసిఫిక్‌లో 1,405 కంపెనీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. వీటిలో 435 కంపెనీలు భారతదేశానికి చెందినవి. ఈ నివేదిక ప్రకారం.. 52 శాతం భారతీయ కంపెనీలు రాబోయే 12 నెలల్లో తమ ఆదాయ దృక్పథం సానుకూలంగా ఉంటుందని నమ్ముతున్నాయి. వ్యాపార దృష్ట్యా ఉద్యోగాల పరిస్థితి కూడా మెరుగవుతుందన్నారు. వచ్చే ఏడాదిలో 30 శాతం కంపెనీలు కొత్త నియామకాలకు సిద్ధమవుతున్నాయని నివేదికలో తేల్చారు.

ఇంజనీరింగ్ (57.5 శాతం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (53.3 శాతం), సాంకేతిక నైపుణ్యాలు (34.2 శాతం), అమ్మకాలు (37 శాతం), ఫైనాన్స్ (11.6 శాతం) వంటి వివిధ రంగాలలో గరిష్ట నియామకాలు ఉంటాయని తేల్చింది. ఈ కంపెనీలు ఉద్యోగులకు అధిక జీతం అందిస్తాయని చెప్పింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగ నష్టం రేటు కూడా తక్కువగా ఉందని అంచనా వేసింది. ఇంతకుముందు డెలాయిట్ తన సర్వేలో 2022 లో సగటు వేతన వృద్ధి 8.6 శాతానికి పెరుగుతుందని ప్రకటించింది. సర్వేలో పాల్గొన్న దాదాపు 25 శాతం కంపెనీలు 2022 నాటికి రెండంకెల వేతన వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది.

UPSC: విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ని ప్రారంభించిన UPSC.. ఈ సేవలు అందుబాటులోకి..

ELSS: పన్ను ఆదాచేసే పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ మంచి ఎంపిక.. దీని గురించి తెలుసుకోండి!

Kalpana Chawla Fellowship: అంతరిక్షంలోకి వెళ్ళాలని కలలలు కంటున్న యువతుల కోసం కల్పనా చావ్లా ఫెలోషిప్

Follow Us
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..
మీ స్కిన్ టైప్‌కు సెట్ అయ్యే బెస్ట్ మాయిశ్చరైజర్‌ ఎలా ఎంచుకోవాలి?
మీ స్కిన్ టైప్‌కు సెట్ అయ్యే బెస్ట్ మాయిశ్చరైజర్‌ ఎలా ఎంచుకోవాలి?
ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
సిలిండర్ అవసరం లేని సరికొత్త పొయ్యి.. ధర ఎంతో తెలుసా?
సిలిండర్ అవసరం లేని సరికొత్త పొయ్యి.. ధర ఎంతో తెలుసా?
ఆ ఒక్క డైలాగ్ ఇప్పటికీ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ ఒక్క డైలాగ్ ఇప్పటికీ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?