Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC: విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ని ప్రారంభించిన UPSC.. ఈ సేవలు అందుబాటులోకి..

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) SC/ST/OBC/EWS/PWBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించింది.

UPSC: విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ని ప్రారంభించిన UPSC.. ఈ సేవలు అందుబాటులోకి..
Upsc
Follow us
uppula Raju

|

Updated on: Oct 20, 2021 | 7:47 PM

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) SC/ST/OBC/EWS/PWBD కేటగిరీకి చెందిన అభ్యర్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించింది. ఈ కేటగిరీల అభ్యర్థులు ఏదైనా పరీక్ష లేదా రిక్రూట్‌మెంట్ సంబంధిత విషయాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800118711 లో సంప్రదించవచ్చు.షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా బలహీనమైన విభాగాలు (EWS), బెంచ్‌మార్క్ వైకల్యాలు (PWBD) కు చెందిన అభ్యర్థులకు సహాయం చేసే లక్ష్యంతో ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.

కమిషన్ పరీక్షలు/రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న లేదా దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు ఈ హెల్ప్‌లైన్ సహాయంతో సమాచారం తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ హెల్ప్‌లైన్ సహాయపడుతుంది. ఈ హెల్ప్‌లైన్ అన్ని పని దినాలలో పనిచేస్తుంది. కమిషన్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. పైన పేర్కొన్న కేటగిరీ అభ్యర్థులు ఏదైనా పరీక్ష/నియామకం లేదా కమిషన్ పరీక్షలకు/నియామకానికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలను తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే సహాయం కోసం ఈ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. లేదంటే అభ్యర్థులు UPSC అధికారిక సైట్‌ను కూడా సందర్శించవచ్చు.

అక్టోబర్ 10 న జరిగిన UPSC ప్రీ ఎగ్జామ్ UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం జరిగింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జరిగింది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు జరిగింది. ఒక నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈసారి UPSC ప్రిలిమ్స్ 2021 కరోనా రెండో వేవ్ కారణంగా ఆలస్యం అయింది. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ విద్యార్థులకు 105 నుంచి 110 వరకు కట్ ఆఫ్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Viral Video: ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్‌ ఓనర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Kodali Nani: ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ సవాల్‌కు స్పందించం: కొడాలి నాని

Mukku Avinash Marriage : ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లివేడుక .. వైరల్ అవుతున్న వీడియో..