Viral Video: ఫైర్ పాన్ తింటున్న యువతి..! షాకైన షాప్ ఓనర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video: పాన్ తింటున్న యువతిని చూసి షాప్ ఓనర్ షాకయ్యాడు. ఎందుకో తెలుసా అది ఫైర్ పాన్. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో
Viral Video: పాన్ తింటున్న యువతిని చూసి షాప్ ఓనర్ షాకయ్యాడు. ఎందుకో తెలుసా అది ఫైర్ పాన్. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోను చాలా ఆస్వాదిస్తున్నారు. షాప్ ఓనర్ హావాభావాలను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. లైక్స్, కామెంట్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఆ వీడియో గురించి మరింత తెలుసుకుందాం.
వీడియోలో ఓ పాన్‌షాపు దగ్గర అమ్మాయి పాన్ తినడాన్ని మనం చూడవచ్చు. మొదటగా ఒక వ్యక్తి ఫైర్ పాన్ చేతిలోకి తీసుకొని యువతికి తినిపిస్తాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. ఆ పాన్‌పై ఫైర్ ఉంటుంది. దానిని తినడం అంత సులువు కాదు. ఆ యువతి మెల్లిగా పాన్ నోట్లో పెట్టుకుంటుంది. కానీ ఈ సన్నివేశం మొత్తాన్ని పాన్‌షాప్ ఓనర్ దగ్గరుండి చూడటం మనం వీడియోలో గమనించవచ్చు. అమ్మాయి పాన్ నోట్లో పెట్టుకునేటప్పుడు అతడి ఫేస్‌లో హావాభావాలు చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవ్వరి తరం కాదు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా అన్నాడు ‘ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి బాబు’.. మరొకరు వీడియో చూస్తూ ‘నవ్వు ఆపుకోలేకపోయా’మన్నారు. ఇలా చాలామంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. ఇప్పటికే ఈ వీడియోను వేల సంఖ్యలో చూశారు. మీరు కూడా చూసి మీ స్పందన తెలియజేయండి.
View this post on Instagram