Sharmila : ‘సారూ.. ! చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ : షర్మిల

టీవల కాలంలో మరింత స్పీడుగా తెలంగాణ సర్కారుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న షర్మిల ఇవాళ ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు...

Sharmila : 'సారూ.. ! చేతకాకనా?  ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?' : షర్మిల
Y S Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 06, 2021 | 4:56 PM

YS Sharmila : వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట సరికొత్త పార్టీతో తెలంగాణ పాలిటిక్స్‌లో అరంగేట్రం షురూ చేసిన వైయస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా వాడి వేడి విమర్శల బాణాలు వదులుతున్నారు. ఇటీవల కాలంలో మరింత స్పీడుగా తెలంగాణ సర్కారుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న షర్మిల ఇవాళ ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి KCR సారూ. మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..? ” అంటూ తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ మీద ప్రశ్నలు సంధించిన షర్మిల మరో ట్వీట్ లో వ్యాక్సిన్ల లభ్యత మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు.

“తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.” అంటూ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

కాగా, త్వరలో అధికారికంగా ప్రకటించబోతోన్న తన ‘వైయస్ఆర్ తెలంగాణ పార్టీ’కి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు. వీరిని పార్టీ అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం ఇటీవల ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read also : Malayalam : నర్సులు మలయాళంలో మాట్లాడొద్దంటూ ఢిల్లీలోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రి సర్కులర్.. స్పందించిన రాహుల్, కేటీఆర్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే