‘మీ ప్రెస్ మీట్ వెనుక జాతీయ జెండా ‘అలంకరణ కోసమా ‘..?’ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి కేంద్ర మంత్రి చురక
మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడల్లా మీ వెనుక భాగంలో జాతీయ జెండాను అలంకరణగా పెడుతున్నారా అని కేంద్ర టూరిజం శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్...ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.
మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నప్పుడల్లా మీ వెనుక భాగంలో జాతీయ జెండాను అలంకరణగా పెడుతున్నారా అని కేంద్ర టూరిజం శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్…ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఇది ఏదో డెకరేషన్ మాదిరి ఉందని, కానీ ఈ వైఖరి జాతీయ జెండా కోడ్ ను ఉల్లంఘించడమే అవుతుందని అంటూ ఆయన కేజ్రీవాల్ కి లేఖ రాశారు. చట్టరీత్యా ఇది సమ్మతం కాదన్నారు. అయితే నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్బంగా వెనుక జెండా మార్పును గమనించిన ప్రహ్లాద్ పటేల్.. మీ పొరబాటును సరిదిద్దుకున్నందుకు ‘థాంక్స్’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మీరు మీ మిస్టేక్ ని సరిద్దుకున్నారు సరే.. కానీ క్షమాపణ కూడా చెప్పుకుని ఉంటే హుందాగా ఉండేది అన్నారు. అలాంటప్పుడు మీరు మీ ‘పెద్ద మనసును’ చాటుకుని ఉండేవారన్నారు.మీ మౌనం మాత్రం సందేహాలను లేవనెత్తుతోందన్నారు. ఇలా ఉండగా ఢిల్లీలో రేషన్ హోమ్ డెలివరీని నిలిపివేయాలంటూ కేంద్రం నిన్న జారీ చేసిన ఉత్తర్వుపై కేజ్రీవాల్ మండిపడ్డారు. రేషన్ మాఫియా ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. నగరంలో ఈ పథకం అమలు కాకుండా చూడాలన్నది రేషన్ మాఫియా ఉద్దేశంగా కనిపిస్తున్నదన్నారు.దీని అమలుకు తమ ప్రభుత్వం అనుమతిని కోరలేదన్న కేంద్రం ఆరోపణను ఆయన తోసిపుచ్చారు.
పిజ్జా హోమ్ డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు పేదలకు తోడ్పడే ఈ స్కీం కు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. నగరంలో సుమారు 70 లక్షలమంది పేదలు ఉన్నారని, వారికి ఈ సమయంలో రేషన్ హోమ్ డెలివరీ ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించిన ఫైలును ఆమోదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని తిప్పి పంపివేసిన సంగతి విదితమే.
మరిన్ని ఇక్కడ చూడండి: Today Gold Rate, Silver Price Video: పసిడిప్రియులకు కాస్త ఊరట. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతున్నా బంగారం ధరకు బ్రేక్.
కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.
హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో కనిపించిన అరుదైన ,అతి విషపూరితమైన కింగ్ కోబ్రా : King Cobra Video