బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఏదీ …? గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన…. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆవేదన.. వివరించాలని చీఫ్ సెక్రటరీకి పిలుపు

బెంగాల్ లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఈ నెల 7 న తనవద్దకు వచ్చి వివరించాల్సిందిగా ఆయన చీఫ్ సెక్రటరీ హెచ్.కె. ద్వివేదీని ఆదేశించారు. ఎన్నికల అనంతర హింసను అదుపు చేయడానికి....

బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఏదీ ...? గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన.... ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆవేదన.. వివరించాలని చీఫ్ సెక్రటరీకి పిలుపు
Bengal Governor Slams Govt. On Law And Order
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 06, 2021 | 6:03 PM

బెంగాల్ లో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్ జగదీప్ ధన్ కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఈ నెల 7 న తనవద్దకు వచ్చి వివరించాల్సిందిగా ఆయన చీఫ్ సెక్రటరీ హెచ్.కె. ద్వివేదీని ఆదేశించారు. ఎన్నికల అనంతర హింసను అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని, ఇప్పటికీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడలేదని ఆయన ట్వీట్ చేశారు. ఇందుకు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని సమర్థించిన ప్రజలను, కార్యకర్తలను సామాజిక బహిష్కరణ చేస్తున్నారని, వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందకుండా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ సొంత ఇళ్లలో ఉన్నవారి నుంచి..బిజినెస్ లు చేసుకుంటున్నవారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు తన దృష్టికి వస్తున్నాయని,ఇవన్నీ చూస్తూ ముఖ్యమంత్రి ఉదాసీనంగా ఉంటున్నారని ధన్కర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ పోలీసులు కూడా ఈ అరాచకాల పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని..పాలక పార్టీకి ‘కొనసాగింపు’ గా వారు ఉన్నట్టు కనబడుతోందని వారిని కూడా ఆయన దుయ్యబట్టారు. లోగడ తన రాజ్ భవన్ గేటు వద్దే కొందరు మేకలు, గొర్రెలతో వింత నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.. కోవిద్ అదుపులో ఈ ప్రభుత్వం విఫలమైందని అంటూ సుమారు మూడు గంటలపాటు అక్కడ వారు ప్రొటెస్ట్ చేసినా పోలీసులు గానీ, సెక్యూరిటీ గార్డులు గానీ అదంతా డ్రామాలా చూస్తూ ఉండిపోయారు.

ఇక-ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసలో సర్వం కోల్పోయిన బాధితుల పునరావాసం కోసం కలకత్తా హైకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. వీరు బాధితుల పునరావాసం కోసం చేపట్టాలవలసిన చర్యలపై ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించనున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video

కరోనా మిగిల్చిన కన్నీటి కథలు..అంతులేని వ్యధలు కరొనతో పోరాడలేక అలిసిపోయి ఊడిపోతున్న కుటుంబాలు ఎన్నో..:Corona Pandemic Live Video

మనిషి నవ్వును అనుకరిస్తున్న పక్షులు..నెటింట్లో వైరల్ అవుతున్న వీడియో.నెటిజన్లు ఫిదా :Laughing Birds Video.