Sharmila Party : ‘మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. కేసీఆర్, హరీశ్ రావు దే బాధ్యత’ : షర్మిల పార్టీ మహిళా నేత

మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో దిక్కుతోచక..

Sharmila Party : 'మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..  కేసీఆర్, హరీశ్ రావు దే బాధ్యత' : షర్మిల పార్టీ మహిళా నేత
Indira Shobhan
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 19, 2021 | 12:38 AM

Indira Sobhan : మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితుడు మల్లారెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో దిక్కుతోచక మల్లారెడ్డి ప్రభుత్వ కూల్చేసిన అతని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఇందిర చెప్పారు. సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన వృద్ధుడు తుటుకూరి మల్లారెడ్డి మనోవేదనతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.

అతని భార్య పేరు మీద ఇల్లు ఉందని.. ఆమె ఇటీవల మరణించడంతో మల్లారెడ్డికి ఇల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో మల్లారెడ్డి ప్రాణాలు తీసుకున్నారని ఇందిరాశోభన్ అన్నారు. భార్య మృతి చెందితే భర్తకు ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆమె ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి ఊరును వదిలి వెళ్తున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. నిర్వాసితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడమేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులే ఇందుకు బాధ్యత వహించాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.

మల్లన్న సాగర్ నిర్వాసితులకు తమ పార్టీ నాయకురాలు షర్మిల అక్క అండగా ఉంటారని, వారి పక్షాన న్యాయ పోరాటం చేస్తారని ఇందిర చెప్పుకొచ్చారు.

Read also : Murder : కడప జిల్లాలో ప్రేమ పేరిట ఓ ఉన్మాది అరాచకం.. యువతి గొంతుకోసి చంపిన వైనం