YS Sharmila Comments: ఒంటరినయ్యానని చింతిస్తున్న షర్మిల.. వైఎస్సార్ వర్ధంతి రోజు కూడా మాట్లాడుకోని అన్నా చెల్లెలు
YS Sharmila Comments: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని

YS Sharmila Comments: ఒకరేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. మరోకరు పక్క రాష్ట్రంలో ప్రత్యేక పార్టీ స్థాపించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు అన్నా-చెల్లెల్లు. అయినప్పటికీ భిన్న లక్ష్యాలతో రాజకీయంగా రాణిస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా రాజకీయంగా అభిప్రాయభేదాలు వచ్చిన తరువాత వ్యక్తిగతంగానూ కలవకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. వారే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల. అయితే ఈ రోజు వారి తండ్రిగారైన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి. ఈ కార్యక్రమంలోనైనా ఇద్దరు మాట్లాడుకుంటారని పార్టీ నేతలు అనుకున్నారు. కానీ అది కుదరలేదు.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యలు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అని షర్మిల ట్వీట్ చేశారు. రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. తాజాగా ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదు.
ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. I Love & Miss U DAD
— YS Sharmila (@realyssharmila) September 2, 2021
వైఎస్ జగన్ ట్వీట్ ఇదీ.. ‘నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు…
నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021