AIMIM UP Incharge: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి AIMIM అంగీకరించింది..!
AIMIM UP Incharge: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రకటనను AIMIM పార్టీ

AIMIM UP Incharge: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రకటనను AIMIM పార్టీ సమర్ధించింది. AIMIM జాతీయ అధికార ప్రతినిధి, ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అసిమ్ వకార్ మాట్లాడుతూ.. తాను గతంలోనే ఈ డిమాండ్ చేశానని చెప్పారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. ఈ రోజుల్లో ఆవులు తరచుగా వీధుల్లో తిరుగుతూ కనిపిస్తున్నాయని అన్నారు. వాటికి మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు.
అయితే ప్రస్తుతం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం గురించి హైకోర్టు సూచించడం హర్షనీయమన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. ఆవుకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు తీసుకురావాలని హైకోర్టు సూచించింది. అలహాబాద్ కోర్టు వ్యాఖ్యలపై ముస్లిం మత నాయకులు కూడా అంగీకరించారని తెలిసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది.
దారుల్ ఉలూమ్ ఫరంగి మహల్ అధికార ప్రతినిధి మౌలానా సూఫియాన్ నిజామి హైకోర్టు సూచనతో ఏకీభవించారు. కేంద్ర ప్రభుత్వం గోవుల రక్షణ కోసం ఒక చట్టాన్ని రూపొందించాలన్నారు. హిందూ సోదరులకు, ఆవుకు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. ఆవులను రక్షించడానికి ప్రభుత్వం ఈ సూచనను పరిశీలించాలన్నారు. హైకోర్టు ఈ విషయంలో వ్యాఖ్యానిస్తూ.. గోవుల సంక్షేమం దేశానికి చాలా ముఖ్యమని వ్యాఖ్యానించింది. భారతీయ సంస్కృతిలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది. పార్లమెంట్ ఏ చట్టం చేసినా ప్రభుత్వం దానిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఆవులను మతపరమైన కోణం నుంచి మాత్రమే చూడరాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆవును పూజిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపింది.