AP High Court: నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్‌కు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లోని  నలుగురు ఐఏఎస్‌ ఆఫీసర్స్ కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష విధించింది..

AP High Court: నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్‌కు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే
Ap High Court
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2021 | 2:30 PM

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లోని  నలుగురు ఐఏఎస్‌ ఆఫీసర్స్ కు హైకోర్టు ఊహించని షాకిచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నలుగురు ఐఏఎస్‌ అధికారులు రావత్,ముత్యాలరాజు,శేషగిరిరావు లకు హైకోర్టు కొన్ని రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే..

ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్షలను ఖరారు  చేసింది. 2015 లో భూమి వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించమని తాము ఇచ్చిన ఆదేశాలను ఇంతవరకూ అధికారులు అమలు చేయనందున ఈ శిక్షలను విధిస్తున్నట్లు పేర్కొంది. 2015 లో భూమి వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించామని హైకోర్టు ఆదేశింగా ఇప్పటి వరకూ అధికారులు ఆ నష్టపరిహారం అందజేయలేదు. దీంతో రావత్, ముత్యాలరాజు, శేషగిరిరావు లకు ధర్మాసనం జైలుశిక్ష ఖరారు చేసింది. బాధిత మహిళకు లక్షరూపాయలను ప్రభుత్వ నిధి నుంచి కాకుండా అధికారుల సొంత డబ్బులను  చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ప్రతివాదుల అభ్యర్ధన మేరకు ఈ శిక్షను 4 వారాలపాటు నిలుపుదల చేసింది.

ముత్యాలరాజుకు రెండువారాల జైలు, వేయిరూపాయల జరిమానా, ఏఎస్ రావత్ కు నెలరోజుల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండువారాల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు రెండువారాల జైలు శిక్ష వేయిరూపాయల జరిమానాను ధర్మాసనం విధించింది. ఈ శిక్షలపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశంతో పాటు హైకోర్టు నెలరోజుల గడువును  ఇచ్చింది.

Also Read: Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే