AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila : షర్మిల తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధులు వీళ్లే.. మరిన్ని క్షేత్రస్థాయి పర్యటనలతో ముందుకెళ్లేలా ప్రణాళికలు

ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి..

YS Sharmila : షర్మిల తెలంగాణ పార్టీ  అధికార ప్రతినిధులు వీళ్లే..  మరిన్ని క్షేత్రస్థాయి పర్యటనలతో ముందుకెళ్లేలా ప్రణాళికలు
YS Sharmila
Venkata Narayana
|

Updated on: Jun 05, 2021 | 9:46 AM

Share

YS Sharmila party official spokes persons : తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి సరికొత్త రాజకీయానికి తెరతీస్తోన్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. అడపాతడపా అధికారపార్టీపై విమర్శలు గుప్పిస్తోన్న షర్మిల.. ఇటీవల క్ష్రేత్తస్థాయి పర్యటనలకు కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తను తెలంగాణలో స్థాపించబోయే పార్టీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను నియమించారు షర్మిల. వీరిలో ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్జాద్ అహ్మద్, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, తేడి దేవేందర్ రెడ్డి, బీశ్వ రవీందర్, మతిన్ ముజాదద్ది, భూమిరెడ్డి ఉన్నారు. వీరిని పార్టీ అధికార ప్రతినిధులుగా పేర్కొంటూ షర్మిల కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, షర్మిల పార్టీని జులై 8న వైఎస్ఆర్ జయంతి రోజున ప్రకటించబోతోన్న సంగతి విదితమే. ఇక, షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)గా ఖరారైంది. ఇటీవల షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఈ పార్టీ పేరును రిజిస్టర్ చేయించారు.

కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇలాకాలో అడుగుపెట్టిన షర్మిల.. తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. . తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశంపై రైతుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవని వైయస్ షర్మిల కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని పర్యటనలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళ్లాలని షర్మిల ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు సమాచారం.

Read also : Palaniswami : పన్నీర్ సెల్వంతో విభేదాలు లేవు.. శశికళ, ఆమె ఫ్యామిలీకి ఎఐఎడిఎంకె లో చోటు లేనేలేదు. తేల్చి చెప్పిన అగ్రనేత