భీమవరం కేంద్రంగా పేలుతున్న డైలాగ్‌ బుల్లెట్లు.. జనసేనానికి రీకౌంటర్‌ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం..

భీమవరం కేంద్రంగా పేలుతున్న డైలాగ్‌ బుల్లెట్లు.. జనసేనానికి రీకౌంటర్‌ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
Follow us
K Sammaiah

|

Updated on: Feb 27, 2021 | 4:59 PM

ఏపీలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అక్కడక్కడా పార్టీల మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనసేన-వైసీపీ కార్యకర్తల మధ్య ఫైటింగ్ కొనసాగుతోంది.

అయితే పొలిటికల్‌ వార్‌ కాస్త కార్యకర్తల పరిధి దాటి నేతల వరకు చేరింది. దీంతో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వర్సెస్‌ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌గా మారింది సీన్‌. మొదట జనసేనపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ నోరుపారేసుకోవడం.. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో మాటల యుద్ధానికి తెరలేచింది. ఇక పవన్‌ కల్యాన్‌ వార్నింగ్‌పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తాజాగా రీ కౌంటర్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

పవన్‌ కామెంట్స్‌కు… అదే టైప్‌లో కౌంటర్‌ ఇచ్చారు గ్రంథి శ్రీనివాస్‌. రెండు చోట్ల పవన్‌ కల్యాణ్‌ను జనం పిచ్చికుక్కలా తరిమికొట్టిన సంగతిని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. తాను ఆకు రౌడీని కాదని, పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌ రౌడీ అని విమర్శించారు గ్రంథి.

పవన్ కళ్యాణ్ స్టేట్ రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనాలోపంతోటీ , అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని ఎద్దేవా చేశారు.

నన్ను పిచ్చి కుక్కల వ్వాన్లో వేసి పంపుతానన్నారు. రెండు చోట్ల ప్రజలు అదే వ్యాన్లో మిమ్మల్ని వేసి పంపించారని ఎద్దేవా చేశారు. మీరు తలలు నరికితే నరికించుకోవడానికి ఎల్లప్పుడూ మా తలలు వంచి మీ కోరిక తీర్చడానికి సిద్దంగా ఉంటామంటూ గ్రంధి తెలిపారు. కాగా, నిన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

వివాదానికి దారి తీసిన పరిస్థితులు:

వీరవాసరం మండలం మత్యపురి గ్రామ సర్పంచ్ పదవిని జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. ఈక్రమంలో విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు జరగడంతో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రంధి కామెంట్స్ కు పవన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమంటని.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ వ్యాన్ వస్తోందంటూ మున్సిపాల్ ఎన్నికల్లో ఓడిస్తామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకురౌడీ అని, కోపరేటివ్ బ్యాంకులో సొమ్ము దాచుకునే చిన్నచితకా శ్రమజీవులను దోచేసిన వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్యే అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటివాడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని ఆశించలేమని వ్యాఖ్యానించారు. గ్రంధి శ్రీనివాస్ లాంటి వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో తమకు బాగా తెలుసని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే చర్యలపై అనవసరంగా స్పందించవద్దన్న పవన్.. “పిచ్చికుక్క కరిస్తే తిరిగి కరవకూడదని.. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు ఆగాలాన్నారు. త్వరలో మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది.. పిచ్చికుక్కని పట్టుకెళ్తుందని” ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్.

మా వాళ్ల తప్పుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో సరిదిద్దుకుంటాం. అంతేతప్ప ఇళ్లపై దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని… ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని హెచ్చరించారు. భీమవరంలో గతంలోనూ శాంతిభద్రతలు దెబ్బతిన్నందున డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

Read more:

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. 21 మందిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ ఉత్తర్వులు