AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొదుపు దిశగా తెలంగాణ అడుగులు.. సీఎం కాన్వాయ్ తగ్గింపు.. ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’?

దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వాల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌పై పడింది. నగరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రతిరోజూ ప్రజా, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుంటారు.

పొదుపు దిశగా తెలంగాణ అడుగులు.. సీఎం కాన్వాయ్ తగ్గింపు.. ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’?
Cm Revanth Reddy Convoy
Balaraju Goud
|

Updated on: May 14, 2026 | 8:28 PM

Share

దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రభుత్వాల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌పై పడింది. నగరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రతిరోజూ ప్రజా, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. తెలంగాణలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే.. ఇంధన వినియోగం, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే షాదీ.కామ్, ఆర్‌పిజి గ్రూప్, పి‌డబ్ల్యూసి వంటి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు డబ్ల్యూఎఫ్‌హెచ్‌కు మారుతున్నట్లు ప్రకటించాయి. అటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం సైతం ఐటీ రంగానికి వర్క్ ఫ్రం హోమ్ అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంధన పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించే అంశంపై అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా సుదూర ప్రయాణాలకు మినహా, నగర పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు సీఎం కాన్వాయ్‌ను కేవలం రెండు లేదా మూడు వాహనాలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి మూడు వాహనాల్లోనే ప్రయాణిస్తుండగా, దీనిపై త్వరలోనే సీఎంవో (CMO) అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రభుత్వ పెద్దలే ఆదర్శంగా నిలుస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్రంలో ఇంధన సంక్షోభ నివారణకు ఎంతగానో దోహదపడనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us