AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లపై లాక్ డౌన్ విధిస్తాం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే హెచ్చ రిక

మహారాష్ట్రలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో సీఎం ఉద్దవ్ థాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు  తమ ప్రెమిసెస్ లో కచ్చితంగా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాలని, లేని పక్షంలో లాక్ డౌన్ విధిస్తామని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లపై లాక్ డౌన్ విధిస్తాం, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే హెచ్చ రిక
Uddhav Thackeray
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 14, 2021 | 1:06 PM

Share

మహారాష్ట్రలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో సీఎం ఉద్దవ్ థాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు  తమ ప్రెమిసెస్ లో కచ్చితంగా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించాలని, లేని పక్షంలో లాక్ డౌన్ విధిస్తామని ఆయన హెచ్చరించారు.  తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని తమను ఇందుకు ప్రేరేపించరాదని   ఆయన అన్నారు. నిజానికి లాక్ డౌన్ విధించాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు.హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సుల  యాజమాన్య సంఘాలతో వర్చ్యువల్ గా సమావేశమైన ఆయన.. ఇటీవల ప్రజలతో బాటు మీ నిర్లక్ష్యం కూడా పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కరోజే 15 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో ఉధ్ధవ్ థాక్రే.. తక్షణమే  మీరు మీ ప్రిమెసెస్ లో అన్ని జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ హెచ్ఛరిక ఇదే చివరిసారి అని, ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా ఆయన అన్నారు. నిన్న ఒక్కరోజే 88 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయాన్ని ఆయన వారి దృష్టికి తెచ్చారు.గతవారం కేంద్ర బృందమొకటి ముంబైని సందర్శించి హోటళ్లు, రెస్టారెంట్లను విజిట్ చేసిందని, అయితే ఆ టీమ్ లోని సభ్యుడొకరు ఎక్కడా ఎవరూ మాస్క్ ధరించిన దాఖలాలు గానీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న సూచనలు గానీ లేవని  తనతో చెప్పారని ఆయన వెల్లడించారు.

కాగా హోటళ్లు, రెస్టారెంట్ యాజమాన్య సంఘాలు కోవిడ్ ప్రొటొకాల్స్ తప్పనిసరిగా పాటించేలా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ని ఏర్పాటు చేయాలనీ ముంబై మూసనిపాల్ కమిషనర్ ఐఎస్ చాహల్ సూచించారు. మరోవైపు తాము ‘కోవిడ్ మార్షల్స్’ ని నియోగిస్తామని షాపింగ్ మాల్స్ నిర్వాహకులు తెలిపారు. షాపింగ్ కి వచ్చే ప్రతి వ్యక్తి పైనా నిఘా పెట్టలేమని, అయితే సాధ్యమైనంత  వరకు ఈ మార్షల్స్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తామని వారు చెప్పారు. దేశంలో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి: ఆన్‏లైన్ షాపింగ్ వస్తువులు ఫేక్ అని తేలితే కంపెనీదే బాధ్యత.. కొత్త పాలసీని తీసుకువచ్చిన కేంద్రం…

కోరిక తీర్చితేనే ఉద్యోగం.. లేదంటే లేదు.. తనకు రావలసిన ఉద్యోగం కోసం వచ్చిన మహిళకు ఉన్నతాధికారి వేధింపులు..