ఇందుకు చంద్రబాబు కౌంటరిచ్చారు. వివేకాను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని అన్నారు. సాయంత్రం ఒక లెటర్ ఇచ్చారని, డ్రైవర్‌ను తొందరగా రమ్మన్నందుకు తనను చంపేబోతున్నాడని, చంపేముందు లెటర్ రాయించారని చంద్రబాబు అన్నారు. తర్వాత భార్య, కుమార్తెను చేతల్లో పెట్టుకుని వేరేవాళ్లు చంపారని నాటకాలు ఆడుతున్నారని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించారు. బండారం భయపడుతుందని భయపడుతున్నారని, చిన్నాన్న చంపే పరిస్థితిలో రాష్ట్రానికి రక్షణ ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడికత్తి కేసుకు రాద్దాంతం చేశారని, కేంద్ర ప్రభుత్వం దీనికి ఎంక్వైయిరీ వేశారని విమర్శించారు.