AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..?

Uttarpradesh Govt: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 68 లక్షల మంది విద్యార్థులకు (యూజీ, పీజీ) ట్యాబ్లెట్లు లేదా స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని ప్రకటించారు.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..?
Tablets Smartphones
uppula Raju
|

Updated on: Oct 28, 2021 | 2:17 PM

Share

Uttarpradesh Govt: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 68 లక్షల మంది విద్యార్థులకు (యూజీ, పీజీ) ట్యాబ్‌లు లేదా స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని ప్రకటించారు. నవంబర్‌ నెలలో పంపిణీ ఉంటుందని తెలిపారు. అయితే సీఎం యోగి సూచనల మేరకు ప్రభుత్వం ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో భారీ స్థాయిలో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న తొలి రాష్ట్రంగా యూపీ అవతరిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థుల డేటాను సేకరించి వారికి ట్యాబ్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తారు.

ఈ ప్రక్రియ GeM పోర్టల్ ద్వారా జరుగుతుంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీంని వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తే పథకం ఆగిపోవాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థుల కోసం యూనివర్సిటీలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను సందర్శించి వివరాలను సేకరిస్తారు. అనంతరం విద్యార్థులకు సమాచారం అందిస్తారు. అయితే మొబైల్‌ కొనుగోలు టెండర్‌కు సంబంధించిన నిబంధనలు, షరతులను త్వరలో కేబినెట్ ముందుంచనున్నట్లు సమాచారం.

యూపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత ఏడు రోజుల్లో టెండర్‌ జారీ అవుతుంది. నవంబరు నుంచి పంపిణీ జరుగుతుంది. విద్యార్థులతో పాటు ఇతర వ్యక్తులకు కూడా ప్రభుత్వం ఉచిత ట్యాబ్‌లు లేదా స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేస్తుంది. ప్లంబర్, కార్పెంటర్, నర్సు, ఎలక్ట్రీషియన్, AC మెకానిక్‌లు మొదలైన వారికి కూడా అందిస్తారు. ఈ పథకం కింద ఎప్పటికప్పుడు యువతను చేర్చుతారు. ట్యాబ్‌లు ఎవరికి ఇవ్వాలి, స్మార్ట్ ఫోన్లు ఎవరికి ఇవ్వాలనేది అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఈ పథకం ప్రయోజనాన్ని అందించడానికి యోగి ప్రభుత్వం ప్రతి జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇది గుర్తించబడిన విద్యా సంస్థల జాబితాను సిద్ధం చేస్తుంది.

మీరు ఈ కంపెనీ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

PPF: వీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై పూర్తి వడ్డీని పొందలేరు.. పన్ను మినహాయింపునకూ అర్హులు కారు..ఎందుకు తెలుసుకోండి!

Weather Report: రైతులకు హెచ్చరిక.. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 31 వరకు భారీ వర్షాలు..