తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘యూరియా’ యుద్ధం..!

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో యూరియా కొరతపై.. హాట్ చర్చ జరుగుతోంది. రైతులు.. యూరియా కోసం.. చెప్పులను లైనులో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. దీంతో.. కేంద్రంపై.. తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణపై.. కేంద్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఏది ఎటున్నా.. రైతులకు మాత్రం యూరియా కొరత చుక్కలు చూపిస్తోంది. కాగా.. తాజాగా..దీనిపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో ఫోన్‌లో మాట్లాడి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లయ్‌పై కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య 'యూరియా' యుద్ధం..!
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 7:08 PM

గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో యూరియా కొరతపై.. హాట్ చర్చ జరుగుతోంది. రైతులు.. యూరియా కోసం.. చెప్పులను లైనులో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. దీంతో.. కేంద్రంపై.. తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణపై.. కేంద్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఏది ఎటున్నా.. రైతులకు మాత్రం యూరియా కొరత చుక్కలు చూపిస్తోంది.

కాగా.. తాజాగా..దీనిపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో ఫోన్‌లో మాట్లాడి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లయ్‌పై కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అవసరానికి మించి యూరియా సప్లై చేసిందన్నారు. ఖరీఫ్‌‌కి ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియాను పంపిందని.. రాష్ట్ర ప్రభుత్వం యూరియాని స్టోరేజ్ చేసుకోవడానికి గోదాములు లేక ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏడూ లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి రిపోర్ట్ ఇచ్చినట్టు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని.. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుందని లక్ష్మణ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖాళీ అయిపోయింది.కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ రాష్ట్రలో కుటుంభ పాలన కొనసాగుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్‌కి మాత్రమే పరిమితమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని.. విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను.. తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ ప్రభుత్వం అమలు కానివ్వటం లేదని విమర్శించారు. రైతుల రుణమాఫీ ఇంత వరకు అమలు చెయ్యలేదు.. రైతు బంధు పథకం కూడా సరిగ్గా అమలుకాలేదు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు…రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారన్నారు. టీఆరెస్ చేస్తున్న పనులన్నింటికి వ్యతిరేకంగా బీజేపీ ప్రజాపోరాటలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..