TV9 Political Special:మారిన పరిస్థితులు.. మళ్ళీ ఎన్నికలు..హుజురాబాద్ పీఠం ఎవరిదో.. టీవీ9 ప్రత్యేక కథనం
TV9 Political Special: తెలంగాణా మలిదశ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు సరికొత్త రాజకీయ మలుపు వైపు పయనిస్తోంది. ఇప్పుడు జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజేంద్ర రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక ఖాయంగా మారింది.
TV9 Political Special: తెలంగాణా మలిదశ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిన కరీంనగర్ జిల్లా ఇప్పుడు సరికొత్త రాజకీయ మలుపు వైపు పయనిస్తోంది. ఇప్పుడు జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈటల రాజేంద్ర రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక ఖాయంగా మారింది. దీంతో ఇక్కడ తాడో పేడో తేల్చుకోవడానికి టీఆర్ఎస్ అధిష్టానం సిద్ధం అయిపోతోంది. మరోవైపు ఈటల రాజేంద్ర కూడా ఆరుసార్లు గెలిచాను.. మరోసారీ నాదే గెలుపు అంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణా రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ ఏం జరగబోతోంది? రాజకీయంగా పరిస్థితులు ఎటువంటి మలుపు తీసుకోబోతున్నాయి. ఆరుసార్లు గెలిచినా ఈటలకు ఈసారీ జనం జై కొడతారా? టీఆర్ఎస్ తన మ్యాజిక్ తొ ఈటలను అడ్డుకోగలుగుతుందా? ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. ఈ నేపధ్యంలో టీవీ9 హుజూరాబాద్ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ప్రజల ముందు పరిచింది. అక్కడి రాజకీయ డాటాను టీవీ9 ప్రత్యేక లైవ్ ద్వారా ప్రసారం చేసింది. ఆ కార్యక్రమం ఇక్కడ చూడొచ్చు.
ఇదీ హుజురాబాద్ నియోజక వర్గం రాజకీయ ముఖచిత్రం..
- హుజూరాబాద్ నియోజకవర్గ మొత్తం ఓటర్లు -2,26,553.
- పురుషులు 1,12,808…మహిళా ఓటర్లు1,13,744
- 2004, 2008లో జరిగిన ఉప ఎన్నికలలో కమలాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన ఈటల
- ఆ తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా2009 లో కమలాపూర్ నియోజకవర్గాన్ని హుజురాబాద్ లో విలీనం చేశారు.
- 2009, 2011 జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఈటల విజయం సాధించారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో జరిగిన ఎన్నికలలోను ఈటల సునాయాసంగా గెలిచారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో కులాల వారిగా ఓటర్లు ఇలా..
- రెడ్డి..22 600
- మున్నురు కాపు..29,100
- పద్మశాలి.26,350
- గౌడ. 24.200
- ముదిరాజ్. 23,220
- గొల్ల. 22,150
- మాదిగ. 35600
- మాల. 11,100
- ఎస్టీ. 4,220
- రజక. 7600
- నాయిబ్రహ్మణ. 3300
- మైనారిటీ. 5,100
- ఇతరులు 12,013
హుజురాబాద్ నియోజక వర్గ విజేతలు వీరే..
- 1957 (ఎస్‌సి) పి.నర్సింగ రావు (ఇండిపెండెంట్) 24,296 ఓట్లతో గెలుపు సమీప ప్రత్యర్ధి జి.రాములు(ఇండిపెండెంట్) కు వచ్చిన ఓట్లు 19,373
- 1962 జి రాములు కాంగ్రెస్ పార్టీ 22,162 ఓట్లతో విజయం సమీప ప్యతర్ధి నాయిన దేవయ్య సీపీఐ కు వచ్చిన ఓట్లు 8057
- 1967 ఎన్‌ఆర్ పొల్సానీ (జనరల్) కాంగ్రెస్ 23,470 ఓట్లతో గెలుపు సమీప ఇండిపెండెట్ అభ్యర్ది ఆర్‌ఆర్ కొత్త సాధించిన ఓట్లు 18,197
- 1972 ఓడితల రాజేశ్వర్ రావు (కాంగ్రెస్) 29,686 ఓట్లతో విజయం సమీప ఇండిపెండెంట్ అభ్యర్ధి ఏకే విశ్వనాథ్ రెడ్డి కి 22,153 ఓట్లు
- 1978 దుగ్గిరాల వెంకట్ రావు (కాంగ్రెస్)35,561 ఓట్లతో విజయం సమీప జేఎన్‌పీ అభ్యర్ధి ఏ.కాశీ విశ్వనాథ రెడ్డికి 21,822 ఓట్లు
- 1983 కొత్త రాజిరెడ్డి (ఇండిపెండెంట్ అభ్యర్ధి) 24,785 ఓట్లతో విజయం సమీప ఇండిపెండెట్ అభ్యర్ది దుగ్గిరాల వెంకట్ రావు కు 20,602 ఓట్లు
- 1985 దుగ్గిరాల వెంకట్ రావు (టీడీపీ) 54,768 ఓట్లతో విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జె.భాస్కర్ రావుకు వచ్చిన 17,876 ఓట్లు
- 1989 కేతిరి సాయిరెడ్డి (ఇండిపెండెంట్)32,953 ఓట్ల తో విజయం సమీప టీడీపీ అభ్యర్ధి దుగ్గిరాల వెంకట్ రావు సాధించిన ఓట్లు 29,251
- 1994 టీడీపీ అభ్యర్ధి ఇనుగాల పెద్దిరెడ్డి 57,727 ఓట్లతో విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్ధి బి.లక్ష్మీకాంత రావు సాధించిన ఓట్లు 38,436
- 1999 టీడీపీ ఇనుగాల పెద్దిరెడ్డి 45,200 ఓట్లతో విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సాయిరెడ్డికి 38,770 ఓట్లు
- 2004 టీఆర్‌ఎస్ అభ్యర్ధి క్యాప్టెన్ వి.లక్ష్మీకాంతరావు 81,121 ఓట్లతో విజయం సమీప టీడీపీ అభ్యర్ధి ఇనుగాల పెద్ది రెడ్డి సాధించిన ఓట్లు 36,451 ఓట్లు
- 2008 (భై పోల్స్) టీఆర్‌ఎస్ అభ్యర్ధి క్యాప్టెన్ వి.లక్ష్మీకాంతరావు 53,547 ఓట్లతో విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్ది కె.సుదర్శన్ రెడ్డి కి వచ్చిన ఓట్లు 32,727
- 2009 టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ 56,752 ఓట్లతో గెలుపు(38.82 శాతం) సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వి. కృష్ణమోహన్ రావు సాధించిన ఓట్లు 41,717(28.54 శాతం)
- 2010 (బై పోల్స్) టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ 93026 ఓట్లతో గెలుపు సమీప టీడీపీ అభ్యర్ధి ముద్ద సాని దామోదర్ రెడ్డ సాధించిన ఓట్లు 13,799
- 2014 టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఈటల రాజేందర్ 95,315 ఓటల్తో గెలుపు (61.44 శాతం) సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కె.సుదర్శన్ రెడ్డి సాధించిన ఓట్లు 38,278 (24.68 శాతం)
- 2018 టీఆర్‌ఎస్ అభ్యర్ది ఈటల రాజేందర్ 1,04,840 ఓట్లతో విజయం(59.34 శాతం) సమీప కాంగ్రెస్ అభ్యర్ది కౌశిక్ రెడ్డి సాధించిన ఓట్లు 61,121(34.60 శాతం
Etela Rajender Joining BJP: కమలం పార్టీ చెంతకు ఈటల.. సోమవారం బీజేపీలో చేరిక!