‘ఇది పంజాబ్ రాష్ట్రంలో కొత్త శకానికి నాంది’…..శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తుపై మాయావతి హర్షం

పంజాబ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో .. శిరోమణి అకాలీదళ్ తో తమ పార్టీ పొత్తును బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు.

'ఇది పంజాబ్ రాష్ట్రంలో కొత్త శకానికి నాంది'.....శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తుపై మాయావతి హర్షం
Mayawati
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 12, 2021 | 7:09 PM

పంజాబ్ లో 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో .. శిరోమణి అకాలీదళ్ తో తమ పార్టీ పొత్తును బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇది చరిత్రాత్మక చర్య అని అభివర్ణించారు. ఆ ఎన్నికల్లో పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు. ఆ రాష్ట్రంలో దళితులు, రైతులు, మహిళలు, యువత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని, వారికి మంచి జీవితాన్ని అందించేందుకు ఈ పొత్తును విజయవంతం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. పంజాబ్ ప్రజలు తమ కూటమికి పూర్తిగా మద్దతునిస్తారని ఆశిస్తున్నామన్నారు. కాగా శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ..మాయావతికి ఫోన్ చేసి ఆమెకు అభినందనలు తెలిపారు. మిమ్మల్ని త్వరలో ఈ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తానన్నారు. ఈ పొత్తు ఈ రాష్టానికి, ఈ దేశానికి కూడా సెక్యులర్, ఫెడరల్ ప్రజాస్వామిక విప్లవానికి నాంది అవుతుందన్నారు. మేం ఈ పొత్తులో ముఖ్యంగా శాంతి, మత సామరస్యానికి ప్రాధాన్యతనిస్తాం అని బాదల్ చెప్పారు.రాష్ట్రంలోని 117 అసెంబ్లీ సీట్లలో బహుజన్ సమాజ్ పార్టీ 20 సీట్లకు, మిగిలిన స్థానాలకు తాము పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమైన రెండు పార్టీల మధ్య పొత్తు ఇప్పుడే కుదరడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు.

25 ఏళ్ళ తరువాత శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్ పార్టీ చేతులు కలపడం విశేషం., 1996 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీలు పొత్తు కుదుర్చుకుని.. రాష్ట్రంలోని 13 లోక్ సభ స్థానాలకు గాను 11 సీట్లల్లో గెలుపొందాయి. ఇలా ఉండగా సీఎం అమరేందర్ సింగ్ ఈ పొత్తును తేలిగ్గా కొట్టిపారేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:  Inter Students : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేశారంటే జాబ్ గ్యారంటీ..! తక్కువ రోజులలో ఎక్కువ బెనిఫిట్..

Viral Video: పి.మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం..! పెళ్లికి తప్పక రాగలరు..?? ( వీడియో )