AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protem Chairman: శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి

తెలంగాణలో మండలి ఛైర్మన్‌ సహా ఆరుగురి పదవీ కాలం నేటితో ముగిసింది. ఛైర్మన్‌తోపాటు డిప్యూటీ ఛైర్మన్‌ కూడా ఇవాళ రిటైర్‌ అవుతుండటంతో ప్రొటెం ఛైర్మన్‌ గా భూపాల్‌రెడ్డిని నియమించారు రాష్ట్ర గవర్నర్.

Protem Chairman: శాసన మండలిలో విచిత్ర పరిస్థితి.. ఒకేసారి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ రిటైర్.. ప్రొటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
Trs Mlc Bhupal Reddy Appointed As Council Protem Chairman
Balaraju Goud
|

Updated on: Jun 03, 2021 | 6:25 PM

Share

telangana legislative council protem chairman: తెలంగాణలో మండలి ఛైర్మన్‌ సహా ఆరుగురి పదవీ కాలం నేటితో ముగిసింది. ఛైర్మన్‌తోపాటు డిప్యూటీ ఛైర్మన్‌ కూడా ఇవాళ రిటైర్‌ అవుతుండటంతో ప్రొటెం ఛైర్మన్‌ గా భూపాల్‌రెడ్డిని నియమించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్.

తెలంగాణ శాసన మండలిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడైనా ఛైర్మన్‌ రిటైర్‌ అయితే… డిప్యూటీ ఛైర్మన్‌ బాధ్యత తీసుకొని ఛైర్మన్‌ ఎంపికను చూసేవారు. ఇప్పుడు ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ కూడా రిటైర్‌ అవుతుండటంతో ప్రొటెం ఛైర్మన్ ఎంపిక తప్పనిసరైంది. ప్రొటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి పేరు ఖరారు చేసింది ప్రభుత్వం.

శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్‌గా నియ‌మిస్తూ గ‌వ‌ర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. రేప‌ట్నుంచి ప్రొటెం చైర్మన్‌గా ఆయన బాధ్యత‌లు చేప‌ట్టనున్నారు. మండ‌లికి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే వ‌ర‌కు భూపాల్ రెడ్డి ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ప్రస్తుత మండ‌లి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగ‌ర్ ప‌ద‌వీ కాలం నేటితో ముగిసింది. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్‌ తమిళిసైకు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు ఆమె అంగీరకించారు. ఇకపై జరిగే మండలి సమావేశంలో భూపాల్‌ రెడ్డి ప్రొటెం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఛైర్మన్‌ ఎంపికను పూర్తి చేయనున్నారు.

తెలంగాణ శాసన మండలిలో ఒకేసారి ఆరుగురు రిటైర్‌ అవుతున్నారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్ల పదవీ కాలం నేటికో ముగిసింది. వీళ్లతోపాటు ఫరీదుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి కూడా మాజీ అవుతున్నారు.

రిటైర్‌ అయిన ఆరుగురిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈనెల 16 రిటైర్‌ అవుతున్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి కేంద్ర ఎన్నికల సంఘం తెలిసిందే.

Telangana Legislative Council Protem Chairman

Telangana Legislative Council Protem Chairman

Read Also… Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది.. త్వరలో లాక్‌డౌన్ ఎత్తివేసే ఛాన్స్ః శ్రీనివాసరావు