DGP Mahender Reddy : ఆస్పత్రికి వెళ్లి హోమ్ గార్డ్ రమేష్‌ను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి
ఇటీవల ప్రమాదానికి గురైన చికిత్స పొందుతోన్న ఒక హోంగార్డును తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు...
Telangana DGP Mahender Reddy : ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతోన్న ఒక హోంగార్డును తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సాయంత్రం ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ కి వెళ్లిన డీజీపీ.. ట్రీట్మెంట్ తీసుకుంటోన్న హోం గార్డ్ రమేష్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోమ్ గార్డ్ రమేష్ కి మంచి ట్రీట్మెంట్ అందించాలని హాస్పిటల్ సిబ్బందిని డీజీపీ కోరారు. అనంతరం రమేష్ కుటుంబసభ్యులతో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పిన డీజీపీ.. అన్నివిధాల అండగా ఉంటామని రమేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. డీజీపీ వెంట రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ ఎల్బీ నగర్ సన్ ప్రీత్ సింగ్, ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, ఎల్బీ నగర్ ట్రాఫిస్ పోలీస్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రమేష్ ఇటీవల ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ ముందు ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న ఓ కారును ఆపబోయి ఆ వాహనం ఢీకొట్టడంతో హోం గార్డ్ రమేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. నిందితుడు సరూర్ నగర్ కు చెందిన కరుణ కుమార్ గా పోలీసులు గుర్తించారు.
కరుణ కుమార్ ఓ ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడని సమాచారం. కరుణపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడిన హోం గార్డ్ రమేష్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది.