Tipu statue dispute: సీమలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు రగడ.. ఎమ్మెల్యే రాచమల్లు ఘాటు వ్యాఖ్యలు
టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం రాయలసీమలో రాజకీయ రగడకు దారితీస్తోంది. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో సీన్ వేడెక్కుతోంది.
Tipu Sultan statue dispute: టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం రాయలసీమలో రాజకీయ రగడకు దారితీస్తోంది. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో సీన్ వేడెక్కుతోంది. తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదం మీద ఇవాళ ఎమ్మెల్యే రాచమల్లు మీడియా ముందుకొచ్చారు. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ నిరాకరించారని.. సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అనుమతితోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మె్ల్యే రాచమల్లు తేల్చిచెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రైవేటు స్థలంలో టిప్పు విగ్రహం ఏర్పాటు చేస్తామని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఏ విగ్రహానికి అనుమతులు లేవని, రోడ్లలో అనుమతి ఇవ్వరని వ్యాఖ్యానించారు. దేశద్రోహి, మతసామరస్యాన్ని దెబ్బతీసే వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయబోమని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉత్తర్వులు కలెక్టర్ ఇచ్చినవి కాదని, గత నెల 24న ఇచ్చినవని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జిల్లా ఎస్పీ అభ్యర్థన మేరకు అప్పటి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులని వివరించారు.
కౌన్సిల్ ఇచ్చిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపామని, అనుమతి ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడా కాదా అనేది నిర్ణయించాల్సింది రాజ్యాంగం, ప్రభుత్వాలని కామెంట్ చేశారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి టిప్పు సుల్తాన్ విగ్రహానికి కలెక్టర్ అనుమతిని నిరాకరించారని, దాన్ని విజయంగా భావిస్తూ ప్రచారం చేయడం సరైంది కాదని హితవు పలికారు.
Read also: Church pastors: గుంటూరు పాస్టర్ల మధ్య గొడవ.. పొలిటికల్ టర్న్. తెరపై ‘అక్రమాల కథా చ్రితం’