Election Campaign: మొదలైన ఎలెక్షన్ హీట్.. సైకిల్‌ యాత్రతో ప్రచారం మొదలు పెట్టిన అఖిలేశ్‌యాదవ్‌

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టారు ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్‌.

Election Campaign: మొదలైన ఎలెక్షన్ హీట్.. సైకిల్‌ యాత్రతో ప్రచారం మొదలు పెట్టిన అఖిలేశ్‌యాదవ్‌
Samajwadi Party
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 05, 2021 | 4:30 PM

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఓవైపు సీఎం యోగి ఆదిత్యానాథ్‌ అయెధ్యపై దృష్టి పెట్టగా విపక్షం కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ , బీఎస్పీ , కాంగ్రెస్‌ కూడా దూకుడు పెంచాయి. సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్‌యాదవ్‌ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. అధిక ధరలు , నిరుద్యోగం , సాగుచట్టాలు, పెరిగిన నేరాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీని చేపట్టినట్టు అఖిలేశ్‌యాదవ్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ లోని అన్ని జిల్లాల్లో సైకిల్‌యాత్ర కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేతలు ప్రకటించారు. మరికొన్ని నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

350 సీట్లలో గెలుస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు అఖిలేశ్‌యాదవ్‌. కాని సైకిల్‌యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే 400 సీట్లకు పైగా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ను కంట్రోల్‌ చేయడంలో యూపీ సీఎం యోగి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు అఖిలేశ్‌.

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఓటమి భయంతో విపక్ష నేతలపై బీజేపీ భౌతికదాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. డబ్బులతో , కండబలంతో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

గంగానదిలో శవాలు తేలడం , లాకప్‌డెత్‌లు , అత్యాచారాలపై ప్రజలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. లక్నోలో 7 కిలోమీటర్ల మేర సైకిల్‌యాత్రలో పాల్గొన్నారు అఖిలేశ్‌యాదవ్‌. సైకిల్‌యాత్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రకు కూడా సమాజ్‌వాదీ పార్టీ ప్లాన్‌ చేస్తోంది.

రాష్ట్రం లోని 75 జిల్లాల్లో రథయాత్ర నిర్వహిస్తామని ఎస్పీ నేతలు తెలిపారు. అభ్యర్ధల ఎంపికలపై 300 నియోజకవర్గాల్లో ఎస్పీ నేతలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రధాన రాజకీయ పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని అఖిలేశ్‌యాదవ్‌ స్పష్టం చేశారు. చిన్నచిన్న పార్టీలతో పొత్తుకు ఓకే అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Shocking Video: ఈ అమ్మాయికి ఇదే బెస్ట్ ఫ్రెండ్.. ఆట.. పాట.. ఎక్కడైనా ఇది ఉండాల్సిందే.. చూస్తే షాక్ అవుతారు..

IND vs ENG 1st Test Day 2 Live: తొలి రోజు టీమిండియా పేస్ పంచ్‌.. ఇవాళ బ్యాటింగ్ బౌండరీలు చూద్దాం..