Minister Etala: అయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎంతో మేలు.. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కామెంట్స్..

Minister Etala: అయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే ఆరోగ్య శ్రీ పథకం ఎంతో మేలని చెబుతున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

  • uppula Raju
  • Publish Date - 6:08 am, Mon, 1 February 21
Minister Etala: అయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ ఎంతో మేలు.. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కామెంట్స్..

Minister Etala: అయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే ఆరోగ్య శ్రీ పథకం ఎంతో మేలని చెబుతున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. జనగామ జిల్లా లింగాల ఘనపురంలోని భ్రమరాంబ కన్వెన్షన్‌ హాల్‌లో ఐఎంఏ 4వ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా టీకాను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఒకే రోజు 10 లక్షల మందికి టీకా ఇచ్చే సమర్థత తెలంగాణకు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో సూచించిన వ్యాధులన్నింటికి చికిత్స అందించాలని ఐఎంఏను కోరారు. ఎటువంటి ఆదాయం లేకున్నా ఏడాది మొత్తం వైద్యారోగ్య శాఖ సేవలు అందిస్తోందని గుర్తు చేశారు.

అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు 986 రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఆరోగ్య సేవ‌ల ఖ‌ర్చుని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108, 104, 102 నెంబ‌ర్ల వాహ‌నాల‌ ద్వారా రోగులకు సత్వర చికిత్సను ప్రభుత్వం అందిస్తోందన్నారు. వై‌ద్యాన్ని నిరుపేద‌ల‌కు మ‌రింత‌ చేరువ చేయాల‌న్నారు. ప్రైవేటు ఆసుపత్రులు, డాక్టర్లు పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల‌కు చేరాల‌న్నారు. సామాజిక బాధ్యత‌తో వైద్యులు ప‌ని చేయాల‌ని సూచించారు.

కరోనా టీకా తయారీ తెలంగాణకే గర్వకారణం.. ముందుగా మాకే ఇవ్వాలన్న ఈటెల..!