AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖబడ్దార్ బీజేపీ! మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి ఎర్రబెల్లి..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ధర్మారెడ్డి ఇంటిని పరిశీలించి, దాడి జరిగిన

ఖబడ్దార్ బీజేపీ! మా సహనాన్ని పరీక్షించవద్దు.. ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి ఎర్రబెల్లి..
uppula Raju
|

Updated on: Feb 01, 2021 | 6:05 AM

Share

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. ధర్మారెడ్డి ఇంటిని పరిశీలించి, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. చిల్లర రాజకీయాలతో అల్లరి మానుకోండని, మా సహనాన్ని పరీక్షించవద్దని, ప్రజాస్వామ్యాన్ని పరిహసించ వద్దని ఖబడ్దార్ బీజేపీ! అంటూ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది వరుసగా నాలుగో దాడని పేర్కొన్నారు.

మొదట ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇంటిపై దాడి,ఆ తర్వాత పరకాల సీఐపై దాడి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో అల్లరి, ఇప్పుడు ఏకంగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారన్నారు. పోలీసుల లాఠీల ను గుంజుకుని ఇంటిపై విసిరారు, రాళ్ళు రువ్వారు, ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డారు ఇదేమి రాజకీయమంటూ ప్రశ్నించారు. బీజేపీ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోందని, దాడులకు దిగుతోందని, గూండా గిరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నిధుల సేకరణపై ధర్మారెడ్డి ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించారు. తన అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే నివృత్తి చేయాలి. కానీ బీజేపీ దౌర్జన్యానికి దిగిందని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితి వస్తే మా పార్టీకి కావలసినంత బలం బలగం ఉందని, కానీ మా పద్ధతి అది కాదని, పార్టీగా బీజేపీని గౌరవిస్తున్నామని అన్నారు. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఎండగట్టాలన్నారు. మా ఓపికకి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ముందుకు పోతున్నామని గుర్తుచేశారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు.

సీఎం జగన్‌కు ఆర్మీ జవాన్ రిక్వెస్ట్…. ఇంటిని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకోలు…

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు