AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PVNR Express Flyover: పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై ప్రయాణం మరింత సులువు.. అత్తాపూర్ వద్ద ర్యాంపును ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ర్యాంపును రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు.

PVNR Express Flyover: పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై ప్రయాణం మరింత సులువు.. అత్తాపూర్ వద్ద ర్యాంపును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister Ktr Inaugurates Newly Constructed Ramp On Pvnr Express Flyover
Balaraju Goud
|

Updated on: May 29, 2021 | 3:05 PM

Share

Minister KTR Inaugurates Newly Constructed Ramp: హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ర్యాంపును రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు. అత్తాపూర్ వద్ద పీవీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ర్యాంపును ప్రారంభించిన కేటీఆర్.. వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో దిగేందుకు వీలవుతుందని మంత్రి తెలిపారు.

అనంతరం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. దాదాపుగా 10 నిమిషాల వీరిద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే, స్థానిక సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకే ఎంపీ ఓవైసీ సమావేశమయ్యారని ఎంఐఎం నేతలు తెలిపారు.

Read Also….  HYDERABAD HOTELS: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి