పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం.. పుదుచ్చేరి రాజకీయాల్లో కీలకం కానున్న తెలంగాణ గవర్నర్
పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించి, తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు..
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా తెలంగాణా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వీ నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు. మిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం
పుదుచ్చేరి గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని పదవి నుంచి తొలగించి, తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య విభేధాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రాష్ట్రపతిని ఈనెల 10వ తేదీన కలుసుకున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను రీకాల్ చేయాలని విన్నవించారు.
ఈ నేపథ్యంలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని తొలగించి, తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను పుదుచ్చేరి రాజ్‌నివాస్ కార్యదర్శి తమిళిసైకి అందజేశారు.
ఇదిలా వుండగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం సాయంత్రం పుదుచ్చేరికి చేరుకున్నారు. ఆమెకు రాజ్‌నివాస్ అధికారులు, బీజేపీ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పుదుచ్చేరి గవర్నర్‌గా నియమితులు కావడం ఆనందంగా ఉందని, రెండేళ్లుగా తెలంగాణా గవర్నర్‌గా పనిచేసిన అనుభవంతో పుదుచ్చేరి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తానని తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు.
Read more: