చంద్రబాబుపై వెల్లంపల్లి తీవ్రస్థాయిలో ఫైర్.. పంచాయతీ ఫలితాలు చూసైనా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న మంత్రి
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ముగిసి, ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక చివరి విడత పోలింగ్ మాత్రమే..
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ ముగిసి, ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక చివరి విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ 89 కి 75 స్థానాలు గెలిచిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫలితాల తరువాత చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని పేర్కొన్నారు. ఈ ఫలితాలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లోనూ విజయవాడలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు.
టీడీపీలోనే అనేక వర్గాలు ఉన్నాయన్నారు. వారిలో వారికే పడకుంటే ప్రజలకు ఎలా సేవ చేస్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు. కుప్పం, టెక్కలి, తుని, మైలవరం లాంటి టీడీపీ కంచుకోటలను వైసీపీ బద్దలు కొట్టిందన్నారు. ఎంపీ కేశినేని నాని తన అఫిడవిట్‌లో లేబర్ కోర్టులో పెండింగ్ కేసు గురించి ప్రస్తావించారన్నారు. 1.47 కోట్ల రూపాయలు ఉద్యోగులకు చెల్లింపులు చేయాల్సి ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాన్ని వెల్లంపల్లి గుర్తు చేశారు.
Read more:
ఏపీ మంత్రికి హైకోర్టులో స్వల్ప ఊరట.. వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న ధర్మాసనం