AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం.. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు..!

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్‌ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆయనకు నివాళులు అర్పించారు.

CM KCR: తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం.. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు..!
Cm Kcr Pays Tribute To Poet C Narayana Reddy
Balaraju Goud
|

Updated on: Jul 28, 2021 | 8:21 PM

Share

CM KCR pays tribute to CNR: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డాక్టర్‌ సినారె ( సింగిరెడ్డి నారాయణ రెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆయనకు నివాళులు అర్పించారు. కవిగా, సినీగేయ రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం చేశారన్నారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సాంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిపారని సీఎం గుర్తుచేసుకున్నారు.

రాజ్యసభ సభ్యునిగా, వివిధ యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్ గా, ఆయన చేసిన సేవలు విలువైనవన్నారు. కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన డా.సినారె, తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. డా.సి.నారాయణ రెడ్డి సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్ లో ” సినారె సారస్వత సదనం” నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Read Also…  Janasena Committee: విజయవాడ,నెల్లూరు నగర జనసేన పార్టీ కమిటీల నియామకం.. ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్