వైసీపీలోకి జేసీ..? అందుకే ఈ కామెంట్స్..!

టీడీపీ సీనియర్‌ నేత.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ పరిపాలనకు 100కు 100 మార్కులు వేస్తా అన్నారు. జగన్‌ విపక్షంలో ఉన్నా… సీఎంగా ఉన్నా.. మా వాడే అని మీడియా ముందు బహిర్గంతంగా చెప్పేసారు. అమరావతిలో.. మీడియాతో మాట్లాడిన జేసీ జగన్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలు కాస్తా టీడీపీ తమ్ముళ్లకు.. ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘జగన్‌.. కిందా మీదా పడుతున్నాడని.. అతన్ని చేయి పట్టి నడిపించేవాడు […]

వైసీపీలోకి జేసీ..? అందుకే ఈ కామెంట్స్..!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 5:01 PM

టీడీపీ సీనియర్‌ నేత.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ పరిపాలనకు 100కు 100 మార్కులు వేస్తా అన్నారు. జగన్‌ విపక్షంలో ఉన్నా… సీఎంగా ఉన్నా.. మా వాడే అని మీడియా ముందు బహిర్గంతంగా చెప్పేసారు. అమరావతిలో.. మీడియాతో మాట్లాడిన జేసీ జగన్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలు కాస్తా టీడీపీ తమ్ముళ్లకు.. ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

‘జగన్‌.. కిందా మీదా పడుతున్నాడని.. అతన్ని చేయి పట్టి నడిపించేవాడు కావాలన్నారు. జగన్‌కి దిశానిర్ధేశం చేయాలనే కానీ.. మంచి పనులు చేస్తారన్నారు. జగన్‌కి కావాలంటే.. మా సలహాలు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. అయినా.. ఒకవేళ వాళ్లు మమ్మల్ని అడిగితే.. తప్పకుండా వెళతా. కానీ.. పిలవకుండా వెళితే.. ఎవరు రమ్మన్నారంటారు..? అయినా మమ్మల్ని ఎవరు రానిస్తారని అన్నారు. ఈ రకంగా చూస్తే.. ఇన్‌డైరెక్ట్‌గా జేసీ వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నారా..? అందుకే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారా..? అని అనిపిస్తోంది.

గత ప్రభుత్వంలో ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయని అవి చూసీ చూడనట్టు వదిలేయాలే కానీ.. మైక్రో స్కోప్‌లో పెట్టి చూడకూడదని..? వ్యాఖ్యానించారు.రాజధాని అమరావతిలోనే ఉంటుంది. అయినా.. మా వాడు.. తెలివి తక్కువ వాడేం కాదని.. జగన్ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడతాయని అన్నారు. అలాగే.. రాష్ట్రానికి.. ప్రజలకు మంచి చేయడానికి జగన్ చాలా కష్టపడుతున్నాడని.. అది అతని మొఖంలో కనిపిస్తోందని చెప్పారు. అలాగే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ఆర్టీసీ ఉద్యోగులను కాపాడారన్నారు. జగన్ ప్రతి పక్షంలో ఉన్నా.. అధికారంలో వున్నా తమ మనిషే అన్నారు.

జగన్‌ వంద రోజుల పరిపాలనపై మాట్లాడిన ఆయన.. సీఎంను ఒకేసారికి ఆకాశానికెత్తేశారు. ఒకేసారి ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. జేసీ ఒక్కసారిగా ఇలా మారిపోవడానికి కారణాలేంటి..? ఈ మాటలు విన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈయన మాటలు చూస్తుంటే.. తొందరలోనే పార్టీ జంప్ అవుతారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతోన్నాయి. అయినా.. మా వాడు మా వాడు.. అని అంటున్న జేసీ.. ఒకప్పుడు జగన్‌ని.. నానా దుర్భాషలాడారు కదా..! ఇప్పుడు జగన్ ఆఫర్ ఇస్తే.. నిజంగానే టీడీపీ గోడ దూకేస్తారా..? ఈ మాటలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో..! జేసీ అక్షింతలు పడతాయా..! లేక కావాలనే ఇలా మాట్లాడుతున్నారా..? ఒకవేళ వైసీపీ పార్టీలోకి జేసీని వెళ్లినా.. అక్కడ నేతలు ఆయన్ని స్వాగతిస్తారా.. లేదో.. చూడాలి.

అసలే.. ఇప్పుడు టీడీపీ గడ్డు కాలం నడుస్తుంది. ఇప్పటి దాకా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు బీజేపీలోకి.. వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పడు మాజీ ఎంపీ జేసీ కూడా మార్టీ మారితే.. టీడీపీ పరిస్థితి ఏంటో..!