పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ రెబల్స్

పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ రెబల్స్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 నియోజకవర్గాలలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు, విశాఖ సౌత్‌లో మహ్మద్ సాదిక్, గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు, మాచర్లలో చలమారెడ్డి, రాయదుర్గంలో దీపక్ రెడ్డి, రాజోలులో బత్తుల రాము, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, నెల్లూరు రూరల్‌లో దేశాయశెట్టి హనుమంతరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Vijay K

Mar 29, 2019 | 7:50 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 12 నియోజకవర్గాలలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని ఆయా జిల్లాల అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగాయి.

చీపురుపల్లి నియోజకవర్గంలో త్రిమూర్తుల రాజు, విశాఖ సౌత్‌లో మహ్మద్ సాదిక్, గాజువాకలో లేళ్ల కోటేశ్వరరావు, మాచర్లలో చలమారెడ్డి, రాయదుర్గంలో దీపక్ రెడ్డి, రాజోలులో బత్తుల రాము, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, నెల్లూరు రూరల్‌లో దేశాయశెట్టి హనుమంతరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోడెల సూర్యలత, పలమనేరులో సుభాష్ చంద్రబోష్, పుట్టపర్తిలో బీసీ. గంగన్న, మల్లెల జయరామ్‌లు, తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్‌లు తొలుత తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు.

దీంతో పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. ఈ తిరుగుబాటు అభ్యర్థులకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామక పదవులు, ఎమ్మెల్సీలు ఇస్తామని నమ్మబలికారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో వీరంతా రంగం నుంచి తప్పుకున్నారు. ఎన్నికల సమయంలో ఈ కీలక పరిణామం తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu