ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన.. ఆ ఆయుధంతో వైసీపీని తిప్పి కొట్టాలన్న టీడీపీ అధినేత

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగిసింది. ఆఖరు రోజు పర్యటనలో టీడీపీ శ్రేణులు, ప్రజల నుంచి చంద్రబాబు..

ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన.. ఆ ఆయుధంతో వైసీపీని తిప్పి కొట్టాలన్న టీడీపీ అధినేత
Follow us
K Sammaiah

|

Updated on: Feb 27, 2021 | 1:18 PM

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగిసింది. ఆఖరు రోజు పర్యటనలో టీడీపీ శ్రేణులు, ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. అనంతరం టీడీపీ యువకులతో సమావేశమైన చంద్రబాబు… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, ప్రజలకు చేస్తున్న దౌర్జన్యాలను ఎత్తి చూపించాలని వారికి సూచనలు చేశారు. మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటించాలని నిర్ణయించారు. కుప్పంలో మూడు రోజుల పర్యటన ముగించుకొన్న చంద్రబాబు బెంగళూరు నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకుంటారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు టీడీపీ నేతలకు తనదైన శైలిలో క్లాస్‌ తీసుకున్నారు. సోషల్ మీడియానే మన అస్త్రం.. ఎంత వాడుకుంటే అంత ఉపయోగం. ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వండి. కుప్పం నుంచి తిరిగి వెళ్తూ కేడర్‌కి చంద్రబాబు చెప్పిన పాఠాలివి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఈసారి హాట్ హాట్‌గా సాగింది. చంద్రబాబు. సోషల్‌ మీడియాను విరివిగా వాడుకోవాలని లెసెన్స్‌ టీచ్ చేశారు. యాక్టివ్‌గా పని చేయాలని సూచించారు. పార్టీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో సమావేశమైన ఆయన… చాలా సూచనలు చేశారు.

టీడీపీ చేస్తున్న కార్యక్రమాలు, గతంలో చేసిన పనులను ప్రజలకు చేరవేయడంలో సోషల్‌ మీడియాను యూజ్‌ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా సమర్థంగా తిప్పి కొట్టాలని హితవు పలికారు. నేతలు ఎవరికి వారుగా కాకుండా కార్యకర్తలతో కలిసి పని చేయాలని ఆదేశించారు. కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని హితబోధ చేశారు. అనంతరం ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ బయల్దేరారు.

చంద్రబాబు మూడు రోజుల పర్యటన చాలా ఆసక్తికరమైన అంశాల మధ్య సాగింది. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ గ్రామాల్లో వైసీపీ పాగా వేసిన తరుణంలో… చంద్రబాబు ఈ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ని కుప్పంలో అడుగుపెట్టనీయబోమని వైసీపీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ చంద్రబాబు, లోకేశ్‌ ఫ్లెక్సీలతో నిండిపోయే కుప్పం ఈసారి వెరైటీగా చంద్రబాబుకు స్వాగతం పలికింది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ ఫొటోలు… ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు చాలా ఆసక్తికి కలిగించాయి.

మొదటి రోజు ఎపిసోడ్‌కు కొనసాగింపు అన్నట్టు రెండో రోజు కూడా పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్‌ నినాదాలు అందుకున్నారు. జూనియర్‌ను ప్రచారంలోకి దించాలని చంద్రబాబుకు సూచించారు. అయితే ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు… మూడు నెలలకోసారి కుప్పం తానే వస్తానని తేల్చేశారు. తనకు వీలుకాని పరిస్థితిలో లోకేశ్‌గాని ఇతర నాయకులు గానీ వస్తారని తేల్చేశారు. దీంతో కార్యకర్తలు చేస్తున్న ఎన్టీఆర్‌ రావాలన్న ప్రచారానికి చంద్రబాబు తెరదించారన్న విశ్లేషణ సాగుతోంది.

మూడు రోజుల పర్యటనలో వైసీపీపై చంద్రబాబు చాలా ఘాటైన విమర్శలు చేశారు. పులివెందుల రాజకీయాలు కుప్పంలో చెల్లవంటు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ చేస్తున్న అరచాకాలను లెక్కకట్టి అధికారంలోకి వచ్చాక చెల్లించుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలపై పెట్టిన కేసులు…. ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని ధైర్యం ఇచ్చారు.

Read more:

తిరుపతిలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పర్యటన.. మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్‌ పెంచిన ఎస్‌ఈసీ