చంద్రబాబులో అంతర్మథనం, కుప్పంలో ఫెయిల్యూర్‌పై ఆగ్రహం.. క్లాస్ పీకుతూనే క్యాడర్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం.!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా కలత పుట్టించినట్టున్నాయి. ఈ ఫలితాల నేపథ్యంలో..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా కలత పుట్టించినట్టున్నాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఆయనలో కోపం.. అసహనం.. ! ఒకింత పెరిగాయని చెబుతున్నారు. కుప్పంలో ఫెయిల్యూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఓవైపు పార్టీ క్యాడర్ కు క్లాస్ పీకుతూనే మరోవైపు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తాజా పరిణామాలతో కుప్పంపై టీడీపీలో, ప్రత్యేకించి చంద్రబాబులో అంతర్మథనం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. గ్రామాలన్నింటినీ వైసీపీ సంబంధిత వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అసలు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు.. టీడీపీ శ్రేణులు ఏమైపోయాయి.. ఇలా ప్రశ్నల వర్షం కురిపించి లోకల్ లీడర్స్‌పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మండల ఇంచార్జ్‌లు, ఇతర నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు, చివర్లో కాస్త బుజ్జగించి, భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరిగిందో నేనూ ఉహించగలను, వైసీపీ బెదిరింపులకు భయపడొద్దు. ఇక మీదట ప్రయత్నిద్దాం. మీకు నేను అండగా ఉంటాను. త్వరలో కుప్పం వచ్చి మకాం వేస్తానంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.