Chandra babu: జగన్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చు.. సంచలన ప్రకటన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..
AP Early Election: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఆ దిశగా ఏమైనా సంకేతాలు వస్తున్నాయా? ఏమో మరి.. రాష్ట్రంలో నేతల మాటలు చూస్తుంటే.. ఇలాంటి డౌట్లే వస్తున్నాయ్ మరి..
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? ఆ దిశగా ఏమైనా సంకేతాలు వస్తున్నాయా? ఏమో మరి.. రాష్ట్రంలో నేతల మాటలు చూస్తుంటే.. ఇలాంటి డౌట్లే వస్తున్నాయి మరి. ఏపీ రాజకీయాల్లో మరోసారి ముందుస్తు ముచ్చట హాట్‌టాపిక్‌గా మారింది. ముందస్తు ఎలక్షన్స్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు(ChandraBabu) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది కాస్తా.. పాలక, విపక్ష నేతల మద్య మాటల యుద్ధానికి దారి తీసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM JAGAN).. ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటూ బాంబు పేల్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రేపు ఎన్నికలొచ్చినా.. సిద్ధంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఏకంగా 160 సీట్లు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేయడం రాజకీయంగా మరింత రచ్చ రేపింది. నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారి తీసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదుగదా… ఉన్న 23సీట్లు కూడా టీడీపీ గెలవదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.
రోజా వ్యాఖ్యలకు ధీటుగా సవాల్ విసిరారు అచ్చెన్న. చంద్రగిరిలో రోజా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని.. అక్కడ టీడీపీ గెలవకపోతే రాబోయే ఎలక్షన్స్‌లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయో, రావో తర్వాత విషయం.. ఈ అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య ముదిరిన మాటల యుద్ధం ఏస్థాయికి చేరుతుందా? అనే ఉత్కంఠ మొదలైందిప్పుడు.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: ఒకవైపు కాల్పుల విరమణ..మరోవైపు దాడులు.. సుమీ నగరంపై విరుచుకుపడ్డ రష్యా
Women’s day 2022: మహిళా అధికారికి అరుదైన గౌరవం.. తెలంగాణలో తొలి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మధులత..