టీడీపీని వీడిన బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే

ఏపీలో టీడీపీ నుంచి భారీగా వలసలు జోరందుకున్నాయి. తాజాగా.. టీడీపీ నేత బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు తనకు టికెట్ కేటాయించలేదనే మనస్తాపంతో పార్టీ మారినట్లు కార్యకర్తల ఆరోపణ. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన జయరాములు.. దేశాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ ఘనవిజయం సాధిస్తారని అన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని.. […]

టీడీపీని వీడిన బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 16, 2019 | 2:33 PM

ఏపీలో టీడీపీ నుంచి భారీగా వలసలు జోరందుకున్నాయి. తాజాగా.. టీడీపీ నేత బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీకి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు తనకు టికెట్ కేటాయించలేదనే మనస్తాపంతో పార్టీ మారినట్లు కార్యకర్తల ఆరోపణ. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన జయరాములు.. దేశాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ ఘనవిజయం సాధిస్తారని అన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని.. ఒక వేళ అధిష్టానం ఆదేశిస్తే.. బద్వేలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.