బీజేపీ ఓ మార్కెటింగ్ కంపెనీ : పాటీదార్ నాయకురాలు రేష్మా పటేల్

గాంధీనగర్పా : పాటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ బీజేపీనై నిప్పులు చెరిగారు. రెండున్నరేళ్ల పాటు పాటిదార్ల ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రేష్మా.. పాటిదార్ల డిమాండ్లను నెరవేరుస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆమె బీజేపీలో చేరారు. అయితే బీజేపీ నాయకుల వ్యవహార శైలితో విభేదించిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపిన అనంతరం బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘డొల్ల ఫథకాలను’ ప్రమోట్ చేసే ‘మార్కెటింగ్ కంపెనీ’గా […]

బీజేపీ ఓ మార్కెటింగ్ కంపెనీ : పాటీదార్ నాయకురాలు రేష్మా పటేల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 16, 2019 | 3:00 PM

గాంధీనగర్పా : పాటీదార్ రిజర్వేషన్ ఆందోళన నాయకురాలు రేష్మా పటేల్ బీజేపీనై నిప్పులు చెరిగారు. రెండున్నరేళ్ల పాటు పాటిదార్ల ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రేష్మా.. పాటిదార్ల డిమాండ్లను నెరవేరుస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఆమె బీజేపీలో చేరారు. అయితే బీజేపీ నాయకుల వ్యవహార శైలితో విభేదించిన ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపిన అనంతరం బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘డొల్ల ఫథకాలను’ ప్రమోట్ చేసే ‘మార్కెటింగ్ కంపెనీ’గా బీజేపీని ఆమె అభివర్ణించారు. పార్టీ కార్యకర్తలను, నేతలను కేవలం డొల్ల పథకాలను మార్కెటింగ్‌కు మాత్రమే వాడుకుంటున్నందున పార్టీని వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పోర్‌బందర్ పార్లమెంటరీ నియోజవర్గం నుంచి పోటీ చేయాలని కూడా నేను నిర్ణయించుకున్నానని.. విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోర్‌బందర్ సీటుపై వారి వైఖరోమిటో స్పష్టం చేయాలని కోరుతున్నాను. ఇక్కడి నుంచి పోటీకి తనకు అవకాశమిస్తే మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది’ అని రేష్మా పటేల్ అన్నారు. అలాంటి నిర్ణయమేదీ తీసుకోని పక్షంలో పోర్‌బందర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, మనవదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు.