‘జనసేన’ కోసం రంగంలోకి దిగిన నీహారిక!
మెగా డాటర్ నీహారిక జనసేన పార్టీకి ప్రచారం మొదలుపెట్టింది. బాబాయ్‌కి తోడుగా.. జనసేన పార్టీకి అండగా.. మెగాడాటర్ నీహారిక ప్రచారాన్ని మొదలుపెట్టారు. జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభిమానుల్ని కోరారు. నీహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ సినిమాలో నటిస్తున్నారు. ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటించారు. మార్చి 23న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ నందు […]
మెగా డాటర్ నీహారిక జనసేన పార్టీకి ప్రచారం మొదలుపెట్టింది. బాబాయ్‌కి తోడుగా.. జనసేన పార్టీకి అండగా.. మెగాడాటర్ నీహారిక ప్రచారాన్ని మొదలుపెట్టారు. జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభిమానుల్ని కోరారు.
నీహారిక ప్రస్తుతం ‘సూర్యకాంతం’ సినిమాలో నటిస్తున్నారు. ప్రణీత్ బ్రమండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటించారు. మార్చి 23న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ నందు పాల్గొన్న నీహారికకు పవన్ అభిమానుల నుండి జై పవర్ స్టార్.. జై జనసేన అంటూ నినాదాలు ఎదురయ్యాయి. వారిని మరింత ఉత్సాహపరిచారు నీహారిక.
‘పవన్ కళ్యాణ్ అసలు పేరు మీకు తెలుసా.. కొణెదల కళ్యాణ్ కుమార్. ఆయన మా నాన్నకు తమ్ముడు. నాకు బాబాయ్. ఆయన జనసేన పార్టీపెట్టిన ప్రచారంలో బిజీగా ఉన్నారు. నాకు ఆంధ్రలో ఓటు లేదు కాబట్టి మీరందరూ జనసేన పార్టీకి ఓటు వేయాలంటూ ఉత్సాహపరిచారు. త్వరలో తానూ ప్రచారంలో యాక్టివ్ అవుతానన్నారు. జనసేన పార్టీ సింబల్ గ్లాసుతో మంచి ఫొటో మెమొరీ ఉందని…ఆ ఫొటోని ఎన్నికల ముందు షేర్ చేస్తానన్నారు నీహారిక. తాజాగా మెగాడాటర్ కూడా ప్రచారంలోకి దిగిపోవడంతో జనసైనికులు మచి జోష్‍లో ఉన్నారు.