Daylight Gold Theft: విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ రైతు దంపతులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఏకంగా 40 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.