నేడు 100 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
న్యూఢిల్లి : లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఇవాళ విడుదల చేయనుంది. సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. సమావేశానంతరం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. 100 మంది అభ్యర్థుల పేర్లు […]
న్యూఢిల్లి : లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఇవాళ విడుదల చేయనుంది. సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. సమావేశానంతరం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. 100 మంది అభ్యర్థుల పేర్లు ఈ జాజితాలో ఉంటాయని చెబుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర నుంచి పోటీ చేసే 18 మంది అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. కాగా, యూపీ లోక్‌సభ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు ఉంటుందని బీజేపీ-అప్నాదళ్ శుక్రవారం ప్రకటించాయి. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే బీజేపీ, అప్నాదళ్ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు బీజేపీ చీఫ్ అమిత్‌షా ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఈనెల 8న జరిగిన పార్లమెంటరీ బోర్టు సమావేశంలో వారణాసి నుంచి మోదీ పోటీ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు.