AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

L.Ramana-TRS: సైకిల్‌ దిగి.. కారు ఎక్కుతున్నారా.. మరికాసేపట్లో L.రమణ పార్టీ మార్పుపై క్లారిటీ..

తెలంగాణ TDP అధ్యక్షుడు L.రమణ కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి త్వరలోనే ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.  ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గురువారం మధ్యాహ్నం ఆయన భేటీ కానున్నారు.

L.Ramana-TRS: సైకిల్‌ దిగి.. కారు ఎక్కుతున్నారా.. మరికాసేపట్లో L.రమణ పార్టీ మార్పుపై క్లారిటీ..
L Ramana
Sanjay Kasula
|

Updated on: Jul 08, 2021 | 1:58 PM

Share

తెలంగాణ TDP అధ్యక్షుడు L.రమణ కారెక్కేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి త్వరలోనే ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది.  ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గురువారం మధ్యాహ్నం ఆయన భేటీ కానున్నారు. రమణ టీఆర్ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు ఇటీవల బాగా వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలోని పలువురు నేతలతో చర్చించి, వాళ్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవకాశముంది. త్వరలో MLAల కోటాలో ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రమణకు TRS ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి KCRతో సమావేశం కానున్నారు. ఈ భేటీ తరువాత ఆయన TRSలో ఎప్పుడు చేరుతారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 L.రమణ గులాబీ జెండా కప్పుకోబోతున్నారు. మరికాసేపట్లోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తారు టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ. నెల రోజుల నుండి ఆయన సైకిల్‌ దిగేస్తారన్న ప్రచారం జరిగింది. కొందరు మంత్రులతో సంప్రదించినట్లు ఆయనే స్వయంగా చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పరిణామం కీలక మలుపులు తిరగబోతోంది. కేసీఆర్‌ను కలిశాక రమణ ఎప్పుడు పార్టీలో చేరేది డిసైడ్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..